జనాలు ఎలా తయారయ్యారంటే సహనం కోల్పోయినప్పుడు తాము ఎక్కడ ఉన్నాం.. ఏం చేస్తున్నాం.. మేము చేసేది కరెక్టేనా.. ఇలా చేయడం వలన ఏమైనా ఇబ్బందులు రావొచ్చా? అని అస్సలు ఆలోచించడమే మానేసినట్లు తెలుస్తోంది. ఆవేశంలో వారు చేసే పనుల వలన ఇతరుల జీవితాలను సైతం రిస్కులో పడేస్తున్నారు. తాజాగా అటువంటి ఘటనే ఒకటి ముంబైలోని థానే జిల్లాలో వెలుగుచూసింది.
అక్కడ రెండు కుటుంబాల మధ్య ఘర్షణ నెలకొంది. దీంతో ఇరు కుటుంబాలకు చెందిన వారు రేకుల ఇంటి మీదకు ఎక్కి కొట్టుకునేందుకు ప్రయత్నించారు. ఈ ఘర్షణలో ఆ రూఫ్ ఒక్కసారిగా కుప్పకూలింది. దీంతో ఒక్కసారిగా 10 మంది వరకు కిందపడ్డారు. అందులో మహిళలు కూడా ఉండటం గమనార్హం. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.