తిరుపతిలోని గత కొంతకాలంగా అందరినీ భయభ్రాంతులకు గురిచేస్తున్న చిరుత ఎట్టకేలకు చిక్కింది.తిరుపతిలోని ఎస్వీయూ క్యాంపస్‌లో అటవీ సిబ్బంది ఏర్పాటు చేసిన బోనులో చిరుత చిక్కింది.ఈ చిరుత కొంత కాలంగా క్యాంపస్‌లో సంచరిస్తున్నట్లు తెలుస్తోంది.
బంధించిన చిరుతను అటవీ సిబ్బంది ఎస్‌వీ జూపార్కుకు తరలించారు. అనంతరం అక్కడ మెడికల్ చెకప్స్ నిర్వహించి ఆ తర్వాత అడవిలో వదిలేయనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. కాగా, ఎస్పీయూ క్యాంపస్‌లో రాత్రిళ్లు చిరుత సంచరిస్తున్నదని పలుమార్లు ఫిర్యాదులు రావడంలో అటవీ శాఖ అధికారులు చాకచక్యంగా బోన్ ఏర్పాటు చేసి పట్టుకున్నారు.చిరుత పట్టుబడటంతో స్థానిక విద్యార్థులు ఊపిరి పీల్చుకున్నారు.