విజయవాడలో ఇద్దరు బాలికలు కనిపించకుండా పోయారు. బయటకు వెళ్తున్నామని చెప్పిన మైనర్లు ఎంతకూ తిరిగి రాలేదు. దీంతో తల్లిదండ్రులు స్థానికంగా గాలించి చూసినా ఫలితం లేకపోయింది. చివరకు బాధిత పేరెంట్స్ పోలీసులను ఆశ్రయించారు. బాలికల పేర్లు, వివరాలను పోలీసులకు తెలియజేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు బాలికల కోసం గాలిస్తున్నారు.
ఇప్పటివరకు బాలికల ఆచూకీ తెలియకపోవడంతో తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. త్వరగా తమ పిల్లలను కనిపెట్టాలని పోలీసులను వేడుకుంటున్నారు. మరోవైపు బాలికల మిస్సింగ్ మిస్టరీగా మారింది. ఆరో తరగతి చదవుతున్న ఇద్దరు బాలికలు ఇంటి నుంచి వెళ్లిన దృశ్యాలు సీసీ టీవీ ఫుటేజీలో కనిపించాయి. దాని ఆధారంగా పోలీసులు బృందాలుగా విడిపోయి బాలికల కోసం వెతుకుతున్నారు.