ప్రస్తుతం తుంగభద్ర పుష్కరాలకు ఎంతో మంది భక్తులు తరలి వెళ్తున్నారు అన్న విషయం తెలిసిందే. కరోనా తుంగభద్ర పుష్కరాలను కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. కొన్ని కొన్ని సార్లు ఇలా పుష్కరాలకు వెళ్ళిన సమయంలో అపశృతి చోటు చేసుకుంటుంది ఇటీవల తుంగభద్ర పుష్కరాలలో కూడా ఇలాంటి అపశృతి చోటుచేసుకుంది. తుంగభద్ర పుష్కరాలలోకి వెళ్లి స్నానం చేసి… పుణ్యఫలం దక్కించుకోవాలి అనుకున్న ఇద్దరు బాలికలు చివరికి ఆ దేవుడి దగ్గరికి వెళ్లి పోయారు.
తుంగభద్ర పుష్కరాలకి వెళ్లి నీటమునిగి ఇద్దరు బాలికలు చనిపోయిన విషాదకర ఘటన జోగులాంబ గద్వాల జిల్లా లో వెలుగులోకి వచ్చింది. అలంపూర్ మండలం గొందిమల్ల మండలంలో పుష్కర స్నానాలకు దిగిన ఇద్దరు బాలికలు ప్రమాదవశాత్తు నీటిలో పడి మృతి చెందారు. అయితే స్థానికులు వారిని ఆస్పత్రికి తరలించినప్పటికే అప్పటికే వారు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతి చెందిన బాలికల్లో గొందుమల్లి కి చెందిన మైథిలి కర్నూలుకు చెందిన దీక్షిత గా గుర్తించారు.