CM REVANTH REDDY : జూనియర్ లెక్చరర్లకు ఉద్యోగ నియామ పత్రాలు అందజేత

-

జూనియర్ లెక్చరర్లకు ఉద్యోగ నియామ పత్రాలను రవీంధ్ర భారతిలో సీఎం రేవంత్ రెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ప్రభుత్వ ఏర్పాటులో మీ  కృషి ఉంది. ఒక కుటుంబంలో ఉద్యోగం వస్తే.. వారి రాబోయే తరాల భవిష్యత్ కూడా మారిపోతుందని తెలిపారు. గత 12 సంవత్సరాలుగా మీకు ఉద్యోగాలు రాకుండా చేసింది గత ప్రభుత్వం. ఈ నష్టం మీది కాదు.. గత ప్రభుత్వం మీకు నష్టం చేసిందని తెలిపారు. 

న్యాయస్థానాల్లో చిక్కు ముడులు విప్పుకుంటూ మీకు ఉద్యోగాలు కల్పించే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. 12 ఏళ్ల మీ యుక్త వయస్సు వృధా అయిందని తెలిపారు. తెలంగాణ వచ్చాక నిరుద్యోగ సమస్య పరిష్కారం అవుతుందని యువత భావించింది. కానీ తెలంగాణ వచ్చాక నిరుద్యోగ సమస్య ఎక్కువ అయింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత 51వేల ఉద్యోగాలను భర్తీ చేసిందని తెలిపారు. 55 రోజుల్లోనే ఉపాధ్యాయ పరీక్షలను నిర్వహించి ఉద్యోగాలను కల్పించామని తెలిపారు. 

Read more RELATED
Recommended to you

Latest news