మీరు మంచి లాప్టాప్ ని కొనాలని అనుకుంటున్నారా..? అయితే హానర్ తీసుకు వచ్చిన లాప్టాప్స్ ని చూడాల్సిందే. హానర్ మ్యాజిక్‌బుక్ ఎక్స్ 14, మ్యాజిక్‌బుక్ ఎక్స్ 15 ల్యాప్‌టాప్‌లు భారత్‌లో విడుదలయ్యాయి. ఇక పూర్తి వివరాలను చూస్తే.. 10వ జనరేషన్ ఇంటెల్ కోర్ ప్రాసెసర్‌లతో ఇవి వస్తున్నాయి. బ్యాక్‌లిట్ కీబోర్డు, ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్, పాప్అప్ వెబ్‌క్యామ్ వంటి ఫీచర్స్ వీటిలో వున్నాయి.
హానర్ మ్యాజిక్ బుక్ X 14 స్పెసిఫికేషన్లు:
ఇంటెల్ యూహెచ్‌డీ గ్రాఫిక్స్, 8జీబీ ర్యామ్, 512 SSD స్టోరేజ్ ఉంటుంది. 14 ఇంచుల ఫుల్‌వ్యూ full-HD IPS యాంటీ గ్లేర్ డిస్‌ప్లేతో హానర్ మ్యాజిక్‌బుక్ ఎక్స్ 14 ల్యాప్‌టాప్ వుంటుంది. అలానే TUV Rheinland low బ్లూ లైట్, ఫ్లికర్ ఫ్రీ సర్టిఫికేషన్లను ఈ డిస్‌ప్లే ని కలిగి ఈ లాప్టాప్ వుంటుంది.
ఇంటెల్ కోర్ ఐ5, ఇంటెల్ కోర్ ఐ3 ప్రాసెసర్ వేరియంట్లలో అందుబాటులోకి వచ్చింది. ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా వుంది. బ్యాక్‌లిట్ కీబోర్డును కలిగి ఉందిది. ప్రైవసీ మోడ్‌తో కూడిన 720 హెచ్‌డీ పాప్‌అప్ వెబ్‌క్యామ్ కూడా. ఎక్స్ 14 ల్యాప్‌టాప్ కి రెండు స్పీకర్లను ఇచ్చారు. 56wh బ్యాటరీ వుంది.
హానర్ మ్యాజిక్ బుక్ X 15 స్పెసిఫికేషన్లు:
ఈ లాప్టాప్ 15.6 ఇంచుల full-HD IPS డిస్‌ప్లే కలిగి ఉంది. యాంటీ గ్లేర్ కోటింగ్ ఉంటుంది. అలానే కోర్ ఐ3 ప్రాసెసర్‌పై పని చేస్తుంది. ఇంటెల్ యూహెచ్‌డీ గ్రాఫిక్స్, 8జీబీ ర్యామ్, 256జీబీ SSD స్టోరేజ్ తో వస్తుంది ఇది.
కనెక్టివిటీ ఫీచర్స్ కూడా బాగున్నాయి. అలానే బ్యాక్‌లిట్ కీబోర్డు, పవర్ బటన్‌కే ఫింగర్‌ప్రింట్ సెన్సార్ కలిగి ఉందిది. వీడియోకాల్స్ కోసం పాప్ అప్ వెబ్‌క్యామ్ ఉంటుంది. 42Wh బ్యాటరీతో ఈ ల్యాప్‌టాప్ వస్తోంది. 65వాట్ల ఫాస్ట్ చార్జింగ్‌కు ఇది సపోర్ట్ ఇస్తుంది.
లాప్టాప్స్ ధరలు:
హానర్ మ్యాజిక్‌బుక్ ఎక్స్ 14 ల్యాప్‌టాప్ ఇంటెల్ కోర్ ఐ3 ప్రాసెసర్ వేరియంట్ ధర రూ.42,990 (ఇంట్రడక్టరీ ధర రూ.39,900)గా ఉంది.
ఇంటెల్ కోర్ ఐ5 టాప్ వేరియంట్ ధర రూ.51,990 (ఇంట్రడక్టరీ ధర రూ.46,990)గా వుంది.
హానర్ మ్యాజిక్‌బుక్ ఎక్స్ 15 ధర రూ.40,990 (ఇంట్రడక్టరీ ధర రూ.38,900)గా ఉంది.
అమెజాన్ లో ఆఫర్ వుంది. దానిని ఉపయోగించుకుంటే ధర తగ్గుతుంది.