తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు లక్షల్లో భక్తులు వస్తూ ఉంటారు. ప్రతిరోజు 70000 నుంచి లక్ష, మధ్యలో భక్తులు తిరుమల శ్రీవారిని దర్శించుకుంటున్నారు. అయితే.. తాజాగా.. ఇద్దరు మహిళలు తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వెళ్లి రచ్చ చేశారు. తిరుమలకు ప్రవేట్ వాహనంలో వచ్చారు ఈ ఇద్దరు మహిళలు. ఈ సందర్భంగా ఘాట్ రోడ్ ఎక్కేటప్పుడు… కారు టాప్ పైన కూర్చొని… రచ్చ చేశారు.

ఘాట్ రోడ్డు చాలా ప్రమాదకరమైన సంగతి తెలిసిందే. అలాంటి రోడ్డు పైన కారు టాప్ ఓపెన్ చేసి… బీచ్ కు వచ్చిన తరహాలో.. వ్యవహరించారు ఆ మహిళలు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో వైరల్ కావడంతో వాళ్లపై యాక్షన్ తీసుకోవాలని… నేటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వారి వల్ల ప్రమాదాలు జరుగుతాయని అంటున్నారు.
View this post on Instagram