విడ్డూరం: అప్పుడే పుట్టిన బిడ్డకు రెండు పళ్లు…!

-

ఎవరికైనా పళ్లు పుట్టిన వెంటనే రావు. పుట్టిన కొన్ని నెలలకు మాత్రమే చిన్నగా పళ్లు వస్తాయి. ఇకపోతే తాజాగా తెలంగాణలోని గద్వాల్ లో అప్పుడే పుట్టిన పసికందుకు రెండు పళ్లు ఉండడం నిజంగా విడ్డూరమే. నేడు గద్వాల పట్టణంలోని విజయ భాస్కర్ రెడ్డి హాస్పిటల్ లో పసిబిడ్డకు తల్లి జన్మనిచ్చింది. అయితే అందరిలా కాకుండా ఆ బిడ్డకు పుట్టుకతోనే పళ్లు ఉండటం నిజంగా ఆశ్చర్యం కలిగించే విషయమే.

baby teth

కింది దవడకు రెండు పళ్లు వచ్చాయని డాక్టర్ వరలక్ష్మి, అసిస్టెంట్ హరికృష్ణ తెలియజేశారు. ఇకపోతే తల్లిబిడ్డ ఇద్దరు క్షేమంగానే ఉన్నారని వైద్యులు చెప్పుకొచ్చారు. నిజానికి ఇలాంటి సంఘటనలు చాలా తక్కువగా చూస్తూ ఉంటాం మనం. ఇంతకుముందు కూడా కొంత మంది ఇలాగే జన్మించారు కూడా. అయితే ఆ బిడ్డ తల్లిదండ్రులు కుటుంబంలో కూడా ఇంతకు ముందు ఇలాగే ఒకరికి పుట్టుకతోనే పళ్లు వచ్చినట్లు తెలియజేశారు. అయితే ఇలా రావడం వల్ల హిందూ సంప్రదాయం ప్రకారం.. జన్మించిన బిడ్డ మేనమామకు గండం ఉంటుందని ప్రతిదీ.

Read more RELATED
Recommended to you

Exit mobile version