ఒంటరయిన ట్రంప్.. ఇక తప్పదు !

-

క్యాపిటల్‌ భవనంపై దాడితో అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ చుట్టూ ఉచ్చు బిస్తోంది. ట్రంప్‌ అభిశంసనకు రంగం సిద్ధమౌతోందనే చెబుతున్నారు విశ్లేషకులు. మరో పక్క ట్రంప్‌ వెంటనే అధ్యక్ష పదవి నుంచి తప్పుకోవాలని సొంత పార్టీ నేతలు కూడా డిమాండ్‌ చేస్తున్నారు. ఇటీవల బైడెన్‌ ఎన్నికను గుర్తించేందుకు గాను ఎలక్టోరల్‌ ఓట్ల ఆమోదానికి కాంగ్రెస్‌ సమావేశమైనప్పుడు… ట్రంప్‌ అభిమానులు క్యాపిటల్‌ భవనాన్ని ముట్టడించి, విధ్వంసానికి పాల్పడ్డారు.

Donald-Trump

అయితే, పక్కా ప్రణాళికతోఓనే ఈ దాడి జరిగినట్టు స్పష్టమౌతోందని అంటున్నారు. ట్రంప్‌ మద్దతుదారులు ఓ లారీ నిండా తుపాకులు, బాంబులు వెంటతెచ్చుకున్నట్టు పోలీసులు గుర్తించారు. క్యాపిటల్‌ భవనం ముట్టడి సందర్భంగా జరిగిన కాల్పుల్లో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ మొత్తం వ్యవహారానికి ట్రంపే బాధ్యుడని అమెరికా చట్టసభల స్పీకర్‌ నాన్సీ పెలోసీ స్పష్టం చేశారు. ఆయన అధ్యక్ష పదవికి రాజీనామా చేయకపోతే. అభిశంసన తప్పదని ఆమె హెచ్చరించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version