ఆషాడమాసం బోనాల పండుగ నిన్న నుంచి ప్రారంభమైన సంగతి తెలిసిందే. అయితే బోనాలు ప్రారంభమైనప్పటికీ కరోనా వైరస్ కారణంగా భక్తిలు ఎవరు లేకుండానే బోనాల పండుగను నిర్వహిస్తున్నారు. ఉజ్జయిని మహాకాళి ఆలయంలో నిర్వహిస్తున్న బోనాల్లో ఈరోజు భవిష్యవాణి కార్యక్రమం జరుగుంతుంది.
ఇంకా ఈ నేపథ్యంలోనే కరోనా వ్యాప్తిపై మహంకాళి భవిష్యవాణిని స్వర్ణలత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎవరు చేసుకున్నది వాళ్లు అనుభవించక తప్పదని ఆమె పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో ప్రజలకు మరిన్ని కష్టాలు తప్పవని, ప్రజలంతా మరింత జాగ్రత్తగా ఉండాలని ఆమె తెలిపారు.
అంతేకాదు.. బోనాల్లో జరుగుతున్న పూజల్లో తనకు ఎటువంటి సంతోషం, తృప్తి లేదు అని అయినప్పటికీ ప్రజలను కాపాడటానికి ఆమె తప్పనిసరిగా పోరాడుతానని చెప్పారు. కాగా ప్రజలు మాత్రం అప్రమత్తంగా ఉండాలని.. ఎంత జాగ్రత్తగా ఉంటె అంత మంచిదని ఆమె హెచ్చరించారు.