ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం చేయడాన్ని అగ్ర రాజ్యం అమెరికా తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ఇప్పటికే ఈ యుద్ధాన్ని వ్యతిరేకిస్తు.. రష్యా పై పలు కఠిన ఆంక్షలు విధించింది. అలాగే రష్యా ప్రెసిడెంట్ పుతిన్ ఆస్తులను కూడా ఫ్రీజ్ చేసింది. తాజా గా మరో కీలక నిర్ణయం తీసుకుంది. కాసేపటి క్రితం అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ జాతిని ఉద్ధేశించి ప్రసగించారు. ఈ సందర్భంగా ఉక్రెయిన్ పై రష్యా చేస్తున్న దాడిపై తీవ్రంగా స్పందించారు. అలాగే అమెరికాలో రష్యా కు చెందిన అన్ని విమానాలపై బ్యాన్ విధిస్తున్నట్టు బైడన్ ప్రకటించారు.
అంతే కాకుండా తమ గగన తలం గుండా.. కూడా రష్యా విమానాలను అనుమతించబోమని కూడా తెల్చి చెప్పారు. అలాగే తాము ఉక్రెయిన్ కు మద్ధతుగా యుద్ధం చేయబోమని జో బైడన్ ప్రకటించారు. కానీ అక్కడి ప్రజలకు తాము అండగా ఉంటామని ప్రకటించారు. ఉక్రెయిన్ నుంచి ఒక్క అంగళం భూమిని కూడా పోనివ్వమని అమెరికా స్పష్టం చేసింది. అలాగే రష్యాను ప్రపంచ దేశాలు ఓంటరిని చేయాలని జో బైడన్ పిలుపు నిచ్చారు. రష్యా అంతు చూస్తామని ప్రకటించారు. ఉక్రెయిన్ల పోరాటం అద్భుతం అని అన్నారు. వారికి యావత్ ప్రపంచ మద్దతు ఉందని అన్నారు. వారి పోరాటం వృథాగా పోదని అన్నారు.