ఉక్రెయిన్‌కు భారీ సాయం.. రూ. 77 కోట్లు ప్ర‌క‌టించిన హాలీవుడ్ స్టార్ హీరో

-

ర‌ష్యా చేస్తున్న సైనిక చ‌ర్య వ‌ల్ల ఉక్రెయిన్ దేశం భారీగా న‌ష్టపోతుంది. ఈ దాడుల వ‌ల్ల ఉక్రెయిన్ కు భారీ గా ప్రాణ న‌ష్టంతో పాటు ఆస్తి న‌ష్టం కూడా జ‌రుగుతుంది. దీంతో ఉక్రెయిన్ సాయం కోసం ప్ర‌పంచ దేశాల‌ను వేడుకుంటుంది. అయితే తాజా గా ఉక్రెయిన్ కు హాలీవుడ్ స్టార్ హీరో లియోనార్డో డికాప్రియో గుడ్ న్యూస్ చెప్పారు. ఉక్రెయిన్ కు 10 మిలియ‌న్ డాల‌ర్లు ( సుమారు రూ. 77 కోట్లు ) విరాళం ఇస్తున్నట్టు ప్ర‌క‌టించారు.

కాగ తాను ఉక్రెయిన్ కు సాయం చేసింది… ర‌హ‌స్యంగా ఉంచాల‌ని లియోనార్డో డికాప్రియో ప్ర‌య‌త్నించాడ‌ని తెలుస్తుంది. అయితే ఈ విషయాన్ని ఇంటర్నేషన‌ల్ వైస్ గ్రాడ్ ఫండ్ అనే సంస్థ తెలిపింది. కాగ ఈ సంస్థ కూడా అంత‌ర్జాతీయం గా ప‌లు సేవా కార్యక్ర‌మాలు చేప‌డుతుంది. అంతే కాకుండా విరాళాలు కూడా ఇస్తుంది. అయితే హాలీవుడ్ స్టార్ హీరో లియోనార్డో డికాప్రియో.. అమ్మ‌మ్మ ఉక్రెయిన్ లోనే జ‌న్మించిన‌ట్టు తెలుస్తుంది. అందుకే.. త‌న వంతు సాయంగా ఉక్రెయిన్ కు లియోనార్డో డికాప్రియో భారీ మొత్తంలో సాయం చేసిన‌ట్టు స‌మాచారం.

Read more RELATED
Recommended to you

Exit mobile version