రష్యా- ఉక్రెయిన్ వార్: ఉక్రెయిన్ దెబ్బకు పిట్టల్లా రాలుతున్న రష్యా యుద్ధవిమానాలు, హెలికాప్టర్లు

-

ఉక్రెయిన్, రష్యా మధ్య వార్ ప్రారంభం అయి దాదాపు మూడు వారాలు అవుతోంది. ఇప్పటి వరకు రెండు దేశాల మధ్య చర్చల్లో పురోగతి కనిపించలేదు. బెలారస్ వేదికగా నాలుగుసార్లు, టర్కీలో ఒకసారి చర్చలు జరిపినా.. ఇరు దేశాల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. దీంతో రష్యా రోజు రోజుకు దాడులను తీవ్ర తరం చేస్తోంది. రాజధాని కీవ్ తో పాటు ఖార్కీవ్, సుమీ, మరియోపోల్ వంటి నగరాలపై దాడులు చేస్తూనే ఉంది. రెండు రోజుల క్రితం పోలాండ్ సరిహద్దుల్లో ఉన్న ఎల్వీవ్ నగరంపై దాడులు చేసింది. అందంగా ఉండే ఉక్రెయిన్ నగరాలు మసిదిబ్బగా మారుతున్నాయి. ఇదిలా ఉంటే రష్యాకు చుక్కలు చూపిస్తున్నాయి ఉక్రెయిన్ బలగాలు. ఉక్రెయిన్ దెబ్బకు భారీగా రష్యాకు సైనిక నష్టం వాటిల్లుతోంది. తాజాగా రష్యాకు కలిగిన నష్టంపై ఉక్రెయిన్ విదేశాంగ శాఖ ఓ ట్విట్ చేసింది. 

ఇప్పటి వరకు 13500 రష్యా సైనికులను హతమర్చామని.. 81 యుద్దవిమనాలను, 95 హెలికాప్టర్లను నేలకూల్చినట్లు వెల్లడించింది. 404 యుద్ధ ట్యాంకులను, 1279 ఆర్మీ వాహనాలను రష్యా నష్టపోయింది. 640 వాహనాలను నష్టపోయింది. 36 యాంటీ ఏయిర్ క్రాప్ట్ వార్ ఫేర్ సిస్టమ్స్ ను ధ్వంసం చేసినట్లు ఉక్రెయిన్ వెల్లడించింది. అమెరికా, బ్రిటన్, మరికొన్ని నాటో దేశాలు ఉక్రెయిన్ కు పరోక్షంగా మద్దతు తెలుపుతున్నాయి. నిధులను, యుద్ధ సామాగ్రిని సమకూరుస్తున్నాయి. దీంతో రష్యన్ ఆర్మీని ఉక్రెయిన్ తీవ్రంగా ఎదుర్కొంటోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version