ఆంక్షలు ఎత్తేయ్యాలి, లేకపోతే ఐఎస్ఎస్ కూలిపోవచ్చు.. రష్యా స్పేస్ డైరెక్టర్ హెచ్చరిక

-

రష్యా మరోసారి ప్రపంచ దేశాలకు వార్నింగ్ ఇచ్చింది. రష్యాపై ఆంక్షలు ఎత్తేయాలని సూచించింది. ఇటీవల ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం తరువాత అమెరికా, కెనడా, యూరోపియన్ దేశాలు, ఆస్ట్రేలియా దేశాలు ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. ఆర్థిక ఆంక్షలు విధించి రష్యాను నిలువరించేందుకు ప్రపంచ దేశాలు ప్రయత్నిస్తున్నాయి.

ఇదిలా ఉంటే ఇలాగే ఆంక్షలు ఉంటే అంతర్జాతీయ అంతరిక్ష సంస్థ (ఐఎస్ఎస్) కూలిపోవచ్చని రష్యా అంతరిక్ష పరిశోధన సంస్థ రోస్ కాస్మోస్ డైరెక్టర్ దిమిత్రి రోగోజిల్ హెచ్చరించారు. గతంలో కూడా ఇలాగే రష్యాతో పెట్టుకుంటే.. ఐఎస్ఎస్ ను కూల్చి వేస్తామంటూ బెదిారింపులకు దిగాడు. 

భూమికి 400 కిలోమీటర్ల ఎత్తులో ఉండే ఐఎస్ఎస్ అమెరికా, యూరోపియన్ యూనియన్, రష్యా, జపాన్, కెనడా భాగస్వామ్యంతో నిర్మించారు. ఇందులో రెండు ప్రధాన వ్యవస్థలు ఉంటే ఒకదానిని అమెరికా, రెండో దాన్ని రష్యా చూసుకుంటుంది. ఇందులో మానవ ఆవాసానికి అనుకూలంగా మార్చే విభాగాన్ని అమెరికా పర్యవేక్షిస్తుండగా… ఐఎస్ఎస్ ను స్థిరమైన కక్ష్యలో ఉంచేందుకు వాడే ప్రొపెల్షన్ సిస్టమ్స్ ను రష్యా పర్యవేక్షిస్తోంది. ఇలాగే ఆంక్షలు కొనసాగితే ఐఎస్ఎస్ కక్ష్య నుంచి కిందికి జారిపోయే అవకాశం ఉందని.. తద్వారా కూలిపోవచ్చని వ్యాఖ్యానించారు.

ఐఎస్ఎస్ పూర్తిగా జీరో గ్రావిటీలో లేదు. 400 కిలోమీటర్ల ఎత్తులోనే ఉండటంతో భూమి ఆకర్షణకు గురి అవుతుంది. దీంతో రోజులు గడిచే కొద్ది.. అది తన కక్ష్య నుంచి నెమ్మదిగా కిందికి జారుతుంటుంది. మళ్లీ కక్ష్యలోకి స్థిరంగా ఉంటేందుకు ప్రొపెల్షన్ రాకేట్లు సహాయపడుతాయి.

ఇదిలా ఉంటే … ఐఎస్ఎస్ భాగస్వామ్యం నుంచి రష్యా తప్పుకుంటే, తమ సంస్థ సహాయాన్ని అందిస్తుందని ఎలాన్ మస్క్ స్పెస్ ఎక్స్ సంస్థ తెలిపింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version