ఉక్రెయిన్, రష్యా మధ్య యుద్ధం ప్రారంభం అయి 35 రోజుల అవుతున్నాయి. బెలారస్, టర్కీ వేదికగా యుద్దం ఆపడానికి శాంతి చర్చలు జరిగాయి. అయితే గతంలో జరిగిన చర్చల్లో ఎలాంటి పురోగతి కనిపించలేదు. అయితే నిన్న టర్కీ ఇస్తాంబుల్ వేదికగా జరిగిన చర్చల్లో కీలక ముందడుగు పడింది. కీవ్, చెర్నివ్ ప్రాంతాల నుంచి తమ బలగాలను ఉపసంహరించుకునేందుకు రష్యా అంగీకరించినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఉక్రెయిన్ కూడా నాటోలో చేరకుండా… తటస్థత పాటిస్తామని జెలన్ స్కీ ఇప్పటికే వెల్లడించారు.
ఉక్రెయిన్, రష్యా చర్చల్లో కీలక ముందడుగు… త్వరలో పుతిన్, జెలన్ స్కీ భేటీ..!
-