అబ్బా! చంద్రబాబు నాయుడిని ఈనాడు పట్టించుకోవడం లేదు అన్నది ఓ విమర్శ. కనుక ఇవాళ కథనాలు కూడా పేలవంగా ఉన్నాయి. వాళ్లు అంతగా దృష్టి సారించి రాసిందీ లేదు. చరిత్రను ఉటంకించి ప్రస్ఫుట రీతిలో చెప్పిందీ లేదు.కనుక ముందు చంద్రబాబు జనంతో మాట్లాడే కన్నా రామోజీ తో మాట్లాడడం బెటర్. ఎందుకంటే రామోజీ అనే శక్తి రాజమౌళి అనే సృజన శక్తి కన్నా పెద్దది కూడా! ఎలానూ ఆ రోజు వైఎస్సార్ అధికారంలో ఉన్నప్పుడు లోపాయికారిగా కాంగ్రెస్ సహకారంతోనే లక్ష కోట్లు అంటూ జగన్ అక్రమాస్తుల కేసులపై కథనాలు వెలువరించింది కనుక ఇప్పుడు కూడా కొందరు నాయకులను డీ ఫేం చేస్తే సరిపోతుంది.
అప్పుడు నిజంగానే చంద్రబాబు కోరుకున్న విధంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయంలో పునర్నిర్మాణం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పునర్నిర్మాణం అన్నవి ఏక కాలంలో జరిగి తీరుతాయి. ముందు ఆ దమ్ము రామోజీ కి ఉండాలి. ముందు ఆ దమ్ము ఎడిటర్
ఎంఎన్ఆర్ కు ఉండాలి. అప్పుడే ఏదయినా సాధ్యం.
ఆ రోజు కన్నెధార కొండ లీజుకు సంబంధించి అదే పనిగా ధర్మానపై అదే పనిగా ఓ జర్నలిస్ట్ వార్తలు వండి వార్చాడు. ఆ విధంగా వాడొక హీరో అయ్యాడు. పోనీ కన్నెధార తరువాత వాడేమయినా సాధించాడా తరువాత జరిగిన భూ అక్రమాలపై ఏమయినా రాశాడా అదీ లేదు అంటే.. అవసరార్థం రాతలు రాశాక, ఇప్పుడేమో వాడే వైఎస్సార్సీపీ భజన చేస్తున్నాడు. ఇంతటి దరిద్రం ఎక్కడయినా ఉంటుందా? కనుక ఇవాళ ఈనాడు వార్తలు రాసే దమ్ములేదు. కనుక బాబు కోరుకున్నంత గా యాంటీ స్టోరీస్ రావు గాక రావు. కనుక ఎన్టీఆర్ అధికారంలోకి తెచ్చినంత సులువుగా ఈ సారి ఈనాడు పేపరోళ్లు జగన్ ను అధికారంలోకి తీసుకురావడం అన్నది జరగని పని! కనుక బాబు గారు మీరు ఈనాడును నమ్ముకోవద్దు . మోడీని నమ్ముకోండి. పనైపోద్ది.