అణు విధ్వంసం ముంగిట ఉక్రెయిన్… న్యూక్లియర్ ప్లాంట్ పై రష్యా దాడి

-

రష్యా- ఉక్రెయిన్ మధ్య భారీ స్థాయిలో ఉద్యమం జరుగుతోంది. తొమ్మిదో రోజుకూడా ఈ రెండు దేశాల మధ్య భీకరంగా పోరాటం సాగుతోంది. ఇదిలా ఉంటే ఉక్రెయిన్ కు భారీ ప్రమాదం పొంచి ఉంది. యూరప్ లోనే అతి పెద్దదైన న్యూక్లియర్ ప్లాంట్ పై రష్యా భారీగా దాడులు చేస్తోంది. దీంతో అణు విధ్వంసం ముందు ఉక్రెయిన్ ఉంది. రష్యా సైనికులు వరసగా కాల్పులు జరపడంతో జాపోరిజ్జియా న్యూక్లియర్ ప్లాంట్ దెబ్బతింది. ఇప్పటికే మంటలు ప్రారంభం అయ్యాయి. ఈ మంటలు ఇలాగే వ్యాపిస్తే… చెర్నోబిల్ విపత్తు కంటే.. దాదాపు 10 రెట్లు విధ్వంసం జరుగుతుందని ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి కుబెలా చెప్పారు. వెంటనే రష్యా కాల్పులను విరమించుకోవాలని డిమాండ్ చేశారు.

సోవియట్ యూనియన్ ఉన్న సమయంలో 1986లో చెర్నోబిల్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ భారీ విస్పోటనం చెందింది. ఆ ప్రభావం ఇప్పటికీ కనిపిస్తోంది. చెర్నోబిల్ ఇప్పటీకీ ఘోస్ట్ సిటీగానే ఉంది. చెర్నోబిల్ నుంచి దాదాపు 30 కిలోమీటర్ల పరిధిలో జనజీవితమే ఉందడు. ఇప్పటికీ అక్కడ అణుధార్మికత ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version