నేడు ఉమామహేశ్వరి అంత్యక్రియలు.. మహాప్రస్థానంలో ఏర్పాట్లు

-

స్వర్గీయ నందమూరి తారక రామారావు చిన్న కూతురు కంఠమనేని ఉమామహేశ్వరి నిన్న అనగా ఆగస్టు ఒకటి 2022 మధ్యాహ్నం సమయంలో తన ఇంటిలో ఫ్యానుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. అయితే  నేడు ఉమా మహేశ్వరి అంత్యక్రియలు జరుగనున్నాయి. ఉమా మహేశ్వరి భౌతిక కాయానికి నేడు మహా ప్రస్థానం లో అంత్యక్రియలు జరుగనున్నాయి.

అమెరికా నుండి ఉదయం 3 గంటలకు ఉమా మహేశ్వరి పెద్ద కూతురు విశాల అండ్ ఫ్యామిలీ హైదరాబాద్ చేరుకుంది. ఇక ఇవాళ ఉమా మహేశ్వరి భౌతిక కాయానికి కడసారి నివాళులు అర్పించనున్నారు. అటు ఉమా మహేశ్వరి భౌతిక కాయానికి సినీ, రాజకీయ ప్రముఖులు కూడా నివాళులు అర్పించానున్నారు. ఉదయం 9 గంటలకు అంతిమ యాత్ర ప్రారంభం కానుంది. ఈ అంతిమ యాత్రలో జూనియర్ ఎన్టీఆర్ పాల్గొనున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version