మొన్న అంట్లు తోమింది, నేడు ఊడ్చింది.. బిజీబిజీగా స్టార్ హీరోయిన్

-

ఎంత పెద్ద స్టార్ హీరోయిన్ అయినా.. ఓ అమ్మాయే కదా అన్న సూత్రాన్ని పరిచయం చేస్తున్నట్టుంది బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్. కరోనా భయంతో సెలెబ్రిటీలంతా ఇంటికే పరిమితమయ్యారు. ఇందులో కొందరు తిండి మీద పడితే, మరికొందరు వర్కౌట్ల మీద పడ్డారు. మరికొంత మంది తమలోని నిగూఢంగా ఉన్న ప్రతిభను అందరికీ పరిచయం చేస్తున్నారు.

బాలీవుడ్ హీరోయిన్స్‌ అందరూ స్వీయ నిర్భందాన్ని తెగ ఎంజాయ్ చేస్తున్నారు. జాన్వీ కపూర్ తనలోని ఆర్టిస్ట్‌ను బయటకు తీసుకొస్తుంది. పూజా హెగ్డే ఇంట్లోనే ఉంటూ తనకిష్టమైన పదార్థాలను తింటోంది. రకుల్ ప్రతీ ఇంటి సామాన్లనే తెలివిగా వర్కౌట్ల కోసం వాడుకుంటోంది.

ఇలా వీరంతా ఓ వైపు అయితే కత్రినా కైఫ్ మరోవైపు. సెల్ఫ్ క్వారంటైన్‌ సమయంలో తనలోని మహిళను మేల్కొపుతోంది. మొన్న అంట్లు తోమిన వీడియోను షేర్ చేస్తూ.. నీటిని ఎలా ఆదా చేయాలో చూపించింది. తాజాగా చీపురు పట్టి ఇంటిని ఎలా శుభ్రపర్చాలో చూపిస్తోంది. మొత్తానికి కత్రినా అయితే కరోనాను ఇలా వాడుకుంటోందన్న మాట.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version