దేశం లో ఎవ్వరూ చెప్పలేని పాయింట్ చెప్పిన ఉండవల్లి .. అదుర్స్ అంతే !

-

కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ సర్కార్ కశ్మీర్ పాకిస్తాన్ భూతం సీఏఏ ఎన్పీఆర్ లాంటి అంశాలు తెరపైకి తీసుకువచ్చి దేశ ప్రజలను మోసం చేస్తోందని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. దేశంలో 2014 ఎన్నికల సమయంలో అధికారంలోకి రాకముందు మోడీ దేశంలో ఆర్థిక వృద్ధి రేటు రెండంకెల సాధిస్తామని హామీ ఇవ్వడం జరిగింది.

అయితే మోడీ కేంద్రంలో అధికారంలోకి వచ్చి ఆరు సంవత్సరాలు అయినా గాని రెండంకెల వృద్ధి రేటు దేవుడెరుగు అప్పటికన్నా ఉన్న వృద్ధిరేటు మరీ పాతాళంలోకి కూరుకుపోయింది దేశ ఆర్థిక వ్యవస్థ ఊబిలో చిక్కుకుపోయింది అంటూ దేశంలో ఎవరూ చెప్పలేని పాయింట్లు లేవనెత్తారు ఉండవల్లి. రాబోయే రోజుల్లో భారతదేశంలో ఈ విధంగానే కొనసాగితే దేశ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమై పోతుందని చర్యలు చేపట్టాలని కేంద్రానికి సూచించారు.

ఆర్థిక వ్యవస్థను సరి చేయడానికి కనీస ప్రయత్నాలు కూడా చేయటం లేదని ఎంపీ అరుణ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో మన దేశం సాయమందించిన బంగ్లాదేశ్ జీడీపీ ఇప్పుడు భారత్ జీడీపీ కన్నా అధికంగా ఉందని తెలిపారు. మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో భారతదేశ ఆర్థిక వ్యవస్థ గాడీలో పడిందని నరేంద్ర మోదీ హయాంలో నాశనమైందని విమర్శించారు. దీంతో ఉండవల్లి చేసిన కామెంట్లు మరియు వీడియో విని సోషల్ మీడియాలో నెటిజన్లు అదిరిపోయే పాయింటు లేవనెత్తారు అదుర్స్..నిజంగా మీరు రాజకీయ మేధావి అని… ఏ జాతీయ రాజకీయ నాయకుడు లేవనెత్తని కోణంలో అద్భుతంగా ప్రశ్నించారని కళ్ళు తెరిపించారు అని పొగుడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version