వైరల్; అండర్ 19 ప్రపంచకప్ ఫైనల్ చూస్తున్న సీనియర్లు…!

-

దక్షిణాఫ్రికాలోని పోట్చెఫ్‌స్ట్రూమ్‌లో 2020 అండర్ -19 ప్రపంచ కప్ ఫైనల్లో భారత్ బంగ్లాదేశ్ జట్లు పోటీ పడుతున్నాయి. భారత్ నిలకడగా బ్యాటింగ్ చేస్తుంది. ఓపెనర్ జైస్వాల్ అర్ధ సెంచరీతో బంగ్లా బౌలర్లకు చుక్కలు చూపిస్తున్నాడు. ఇదిలా ఉంటే జూనియర్ జట్టుకు శుభాకాంక్షలు తెలియజేస్తూ బిసిసి ఒక ఫోటో ని ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. ఇందులో భారత ఆటగాళ్ళు రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్,

ప్రధాన కోచ్ రవిస్ శాస్త్రి, బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథౌర్ తదితరులు టీవీ లో ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ ని వీక్షిస్తూ ఉంటారు. కెప్టెన్ ప్రియామ్ గార్గ్ నేతృత్వంలోని భారత జట్టు ఫైనల్స్‌కు దూసుకువెళ్ళడంపై పలువురు అభినందిస్తున్నారు. ఇప్పటి వరకు అండర్ 19 టీం ఇండియా నాలుగు ప్రపంచకప్ లను గెలిచి దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. నాలుగు టైటిల్స్ ఉన్నాయి.

ఓపెనర్ యషస్వి జైస్వాల్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు మరియు పాకిస్థాన్‌తో జరిగిన సెమీ-ఫైనల్ మ్యాచ్‌లో అతను అజేయంగా సెంచరీ చేసి జట్టుని ముందుండి నడిపించాడు. నిన్న, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా, శార్దుల్ ఠాకూర్, మయాంక్ అగర్వాల్ సహా పలువురు సీనియర్ సీనియర్ క్రికెట్ జట్టు ఆటగాళ్ళు వీడియో ద్వారా తమ జూనియర్లకు శుభాకాంక్షలు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version