బాబు రుణం తీర్చుకున్న వారిని టార్గెట్ చేసిన జగన్…!

-

తన హయాంలో చంద్రబాబు పెంచి పోషించిన అవినీతి అధికారులను ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ టార్గెట్ చేశారా…? అంటే అవుననే సమాధానం వినబడుతోంది. వాస్తవానికి చంద్రబాబు తాను అధికారంలోకి రాగానే 2004కు ముందు ఉన్న అధికారులకు పోస్టింగ్ ఇచ్చారు. ఎన్టీఆర్ నుంచి పదవి తీసుకోవడానికి అలాగే మావోయిస్టుల ఏరివేత లో కీలకంగా వ్యవహరించిన పలువురు అధికారులకు ఆయన పదవులు ఇచ్చారు.  అందులో భాగంగానే మాజీ డిజిపి సాంబశివరావు మాజీ ఇంటిలిజెన్స్ చీఫ్ వెంకటేశ్వరరావు వంటి వారికి చంద్రబాబు తన హయాంలో పదవులు ఇచ్చిన సంగతి తెలిసిందే.

అలాగే ఎమ్మెల్యేల కొనుగోలు విషయంలో వెంకటేశ్వరరావు ఏ స్థాయిలో సహకరించారో అందరికీ తెలిసిన విషయమే అదేవిధంగా నంద్యాల ఉప ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీకి వెంకటేశ్వరరావు ప్రభుత్వ హోదాలో ఉండి సహకరించారు. దీంతో చంద్రబాబు వారి విశ్వాసాన్ని ఆర్థికంగా వారికి లబ్ధి చేకూర్చిన రుణం తీర్చుకున్నారు అని అంటున్నారు.

 

చాలామంది కీలక అధికారులకు చంద్రబాబు పలు కాంట్రాక్టర్లు కూడా ఇచ్చినట్లు సమాచారంవిలువైన కాంట్రాక్టులకు వారికి అప్పగించడమే కాకుండా వారిని నేరుగా కాంట్రాక్ట్ సంస్థలకు కూడా ఆయన పరిచయం చేశారు. ఇప్పుడు వారందరినీ జగన్ టార్గెట్ చేస్తున్నారు.  ఎవరైతే చంద్రబాబుకి సహకరించడమే కాకుండా ప్రభుత్వంలో ఉండి అక్రమాలకు పాల్పడ్డారని భావిస్తున్నారో వారందరినీ పదవి నుంచి తప్పించే ఆలోచనలో జగన్ ఉన్నట్లు సమాచారం. త్వరలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లో మరిన్ని సంచలనాలు నమోదు అయ్యే అవకాశం ఉందని ప్రచారం ఇప్పుడు ఎక్కువ జరుగుతుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version