తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య ఎక్కువగా ఉందని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ అన్నారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే రాష్ట్రంలో నిరుద్యోగ ఎమర్జెన్సీని ప్రకటించాలని దాసోజు శ్రవణ్ డిమాండ్ చేశారు. కాగ రాష్ట్ర సాధనలో ఉద్యమ కారుల ఆకాంక్షలను నెరవేర్చడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం విఫలం అయిందని విమర్శించారు. కాగ రాష్ట్రంలో 91 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేస్తామని ప్రభుత్వం ప్రకటించిందని అన్నారు.
కానీ మరో లక్ష ఉద్యోగాలు కూడా ఖాళీగా ఉన్నాయని అన్నారు. ఈ లక్ష ఉద్యోగాలు ఎటు పోయాయని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కాగ నిరుద్యోగం పై లోతైన చర్చ జరగాలని ఆయన అభిప్రాయ పడ్డారు. దీనిపై అఖిల పక్షంతో సమావేశం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అంతే కాకుండా నిపుణలతో కలిసి టాస్క్ కమిటీని కూడా ఏర్పాటు చేయాలని అన్నారు.
కాగ నిరుద్యోగ భృతిని రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. అలాగే ఫీల్డ్ అసిస్టెంట్లను రెండు ఏళ్ల పాటు ఇబ్బంది పెట్టారని విమర్శించారు. అందువల్లే 70 మంది ఫీల్డ్ అసిస్టెంట్లు చనిపోయారని ఆరోపించారు. వారి కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.