తెలంగాణ రాష్ట్రంలో నేడు కొత్త‌గా 63 క‌రోనా కేసులు

-

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కరోనా వైర‌స్ వ్యాప్తి దాదాపుగా త‌గ్గిపోయింది. గ‌త 25 రోజుల నుంచి రాష్ట్రంలో వంద లోపే క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు అవుతున్నాయి. అలాగే క‌రోనా మ‌ర‌ణాలు కూడా వెలుగు చూడ‌టం లేదు. కాగ రోజు రోజు కరోనా వైర‌స్ నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య కూడా పెరిగిపోతుంది. కాగ నేటి కరోనా బులిటెన్ ను తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు కాసేప‌టి క్రితం విడుద‌ల చేశారు.

corona cases | కరోనా కేసులు

ఈ క‌రోనా బులిటెన్ ప్ర‌కారం… గ‌డిచిన 24 గంట‌ల్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 63 క‌రోనా వైర‌స్ పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. అలాగే ఈ రోజు కూడా రాష్ట్రంలో క‌రోనా వైర‌స్ కు సంబంధించి ఎలాంటి మ‌ర‌ణాలు న‌మోదు కాలేదు. కాగ ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా 102 మంది క‌రోనా వైర‌స్ నుంచి పూర్తిగా కోలుకున్నారు. దీంతో రాష్ట్రంలో ప్ర‌స్తుతం కేవ‌లం 777 క‌రోనా యాక్టివ్ కేసులు మాత్ర‌మే ఉన్నాయి. కాగ గ‌డిచిన 24 గంట‌ల్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు 22,400 క‌రోనా నిర్ధార‌ణ పరీక్షలు నిర్వ‌హించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version