అక్టోబర్ 2 నుండి నిరుద్యోగ సైరన్ : రేవంత్ కీలక ప్రకటన

-

అక్టోబర్ 2 నుండి డిసెంబర్ 9 వరకు నిరుద్యోగ సైరన్ మోగిస్తమని…టీపీసీసీ చీఫ్‌ రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. . సెప్టెంబర్ 17 ఎంత పవిత్రమైనదో.. డిసెంబర్ 9 కూడా అంతే పవిత్రమైన రోజు అని తెలిపారు. ఈ నేపథ్యంలోనే అక్టోబర్ 2 నుండి విద్యార్థి – నిరుద్యోగుల సైరన్ మోగిస్తున్నట్లు చెప్పారు రేవంత్‌. దళితులు మరియు ఆదివాసులను కెసిఆర్ ఎలా వచ్చించారో దళిత దండోరా తో చెప్పామని…. మరో 65 రోజుల కార్యక్రమం తీసుకున్నామని స్పష్టం చేశారు.

త్యాగాల పునాదులపై ఏర్పడ్డ తెలంగాణ లో త్యాగాలకు విలువ లేకుండా పోయిందని…. కెసిఆర్ రాచరిక పాలన కొనసాగిస్తున్నారని ఫైర్‌ అయ్యారు రేవంత్ రెడ్డి. తెలంగాణ తల్లి కెసిఆర్ ఫార్మ్ హౌస్ లో బందీ అయ్యిందని.. తెలంగాణ తల్లి బందీ నుండి బయటకు తెచ్చేందుకు ఉద్యమం చేస్తున్నామని స్పష్పం చేశారు రేవంత్‌ రెడ్డి. నిరుద్యోగ భృతి లేదు..ఉద్యోగ నియామకాలు లేవని.. 60 లక్షల మంది నిరుద్యోగులకు కెసిఆర్ బకాయి పడ్డారని నిప్పులు చెరిగారు. ఒక్కో విద్యార్థి కి లక్ష రూపాయలు నిరుద్యోగ భృతి అప్పు పడ్డారని ఫైర్‌ అయ్యారు. ఏడెండ్లు లో ప్రతి నెల 10 వేల మంది ఉద్యోగ విరమణ పొందుతున్నారన్నారు. నిరుద్యోగుల సమస్యల కోసం నిరంతరం పోరాటం చేస్తామని స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version