యూనియన్‌ బ్యాంక్‌ కస్టమర్లకు శుభవార్త.. తగ్గనున్న వడ్డీ రేట్లు..!

-

యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా తన కస్టమర్లకు శుభవార్త చెప్పింది. మార్జినల్‌ కాస్ట్‌ ఆఫ్‌ ఫండ్స్‌ – బేస్డ్‌ లెండింగ్‌ రేట్‌ (ఎంసీఎల్‌ఆర్‌)ను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. 15 పాయింట్ల వరకు వివిధ టెనార్‌లపై ఎంసీఎల్‌ఆర్‌ను తగ్గిస్తున్నట్లు తెలిపింది. దీంతో ఆ బ్యాంకు ఎంసీఎల్‌ఆర్‌ ప్రస్తుతం 7.40 శాతం నుంచి 7.25కు తగ్గింది. గతేడాది జూలై 2019 నుంచి ఆ బ్యాంక్‌ ఇలా ఎంసీఎల్‌ఆర్‌ను తగ్గించడం ఇది 14వ సారి.

ఎంసీఎల్‌ఆర్‌ను తగ్గించడంతో యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఆయా రుణాలపై అందించే వడ్డీ రేట్లు కూడా తగ్గనున్నాయి. ఇక ఈ నిర్ణయాన్ని ఆ బ్యాంకు మంగళవారం (ఆగస్టు 11) నుంచి అమలు చేయనుంది.

కొత్తగా మారిన విలువ ప్రకారం 1 నెలకు ఎంసీఎల్‌ఆర్‌ 6.80 శాతం కాగా.. 3 నెలలకు 6.95 శాతం అవుతుంది. అదే 6 నెలలకు అయితే 7.10 శాతం అవుతుంది. ఏడాదికి అయితే 7.25 శాతం అవుతుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version