సింహం బట్టలు వేసుకోదు… కోహ్లీ వేసుకుంటాడు.. అబ్బో ఆ ట్వీట్

-

ఐపీఎల్​ ఫ్రాంచైజీ ఆర్సీబీ.. విరాట్​ కోహ్లీకి సంబంధించిన ఓ ఫొటోను తన ట్విట్టర్​ ఖాతాలో షేర్​ చేసింది. దీనిపై టీమ్​ఇండియా స్పిన్నర్​ యుజ్వేంద్ర చాహల్​ సరదాగా కామెంట్​ చేశాడు.ఐపీఎల్​ ప్రారంభమవుతున్న వేళ.. సంబంధిత ఫ్రాంచైజీలు మంచి హుశారుగా ఉన్నాయి. ఈ క్రమంలోనే అభిమానుల్లో ఉత్సాహం నింపేందుకు సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నాయి. తాజాగా రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరు(ఆర్సీబీ).. విరాట్​ కోహ్లీకి సంబంధించి ఆసక్తికర ట్వీట్​ చేసింది. ఓ వైపు కోహ్లీ, మరోవైపు సింహం ఉన్న ఫొటోను పోస్ట్​ చేసి… ఇందులో తేడాని గుర్తించాలని.. తమకు తెలియడం లేదని రాసుకొచ్చింది.

kohil
kohil

అయితే, టీమ్​ఇండియా స్పిన్నర్​ యుజ్వేంద్ర చాహల్​ ఈ ఫొటోపై స్పందించాడు. “తేడా ఏంటంటే.. మొదటి ఫోటోలో సింహం బట్టలు వేసుకుంది. రెండో చిత్రంలో వేసుకోలేదు అంతే” అని చమత్కరించాడు.యూఏఈ వేదికగా సెప్టెంబరు 19న ఐపీఎల్ మెదలుకానుంది. ఇటీవలే కేంద్రం నుంచి అనుమతి కూడా లభించడం వల్ల ఫ్రాంచైజీలు ప్రయాణానికి సమాయత్తమవుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version