బడ్జెట్ మెరుపులు..ధరలు పెరిగేవి..తగ్గేవి ఇవే!

-

ఎన్నికలకు ఇంకా 15 నెలల సమయం ఉన్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అనుహ్యా రీతిలో బడ్జెట్ 2023-24 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ని కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశ పెట్టారు. ఈ బడ్జెట్‌లో  హైలైట్స్ చాలా ఉన్నాయి…అందులో ప్రధానంగా వేతన జీవులకు ఊరటనిస్తూ కొన్న పన్ను విధానాన్ని తీసుకొచ్చారు. రూ.7 లక్షల వరకు ఆదాయపు పన్ను మినహాయింపులు ఇచ్చారు. కీలక రంగాలకు కేటాయింపులు చేశారు. అందులో రైల్వేకు రూ.2.4 లక్షల కోట్లు 2023-24 బడ్జెట్లో కేటాయించారు.

ఇక కొన్నింటిపై సుంకాలు పెంచడం, కొన్నింటిపై తగ్గించడం వంటి చర్యలు తీసుకున్నారు. అయితే టీవీ పార్టులపై       ప్రస్తుతం ఉన్న 5 శాతం కస్టమ్స్ సుంకాన్ని 2.5 శాతానికి తగ్గించారు. లిథియం అయాన్ బ్యాటరీలపై అవసరమైన సామగ్రి పైనా కస్టమ్స్ సుంకాన్ని మినహాయించారు. దీంతో వాటి ధరలు తగ్గనున్నాయి. బంగారం, వెండి ధరలపై కస్టమ్స్ డ్యూటీ పెంచారు. దీంతో గోల్డ్, సిల్వర్, ఆభరణాల ధరలకు రెక్కలు రానున్నాయి.

ధరలు తగ్గేవి..

  • ఎలక్ట్రిక్ వాహనాలు
  • టీవీలు, విడిభాగాలు
  • మొబైల్స్
  • కెమెరా లెన్స్
  • దిగుమతి చేసుకునే బంగారం
  • లిథియం అయాన్ బ్యాటరీలు
  • ల్యాప్‌టాప్, డీఎస్‌ఎల్‌ఆర్‌ల కెమెరా లెన్సులు
  • దేశీయంగా ఉత్పత్తి చేసే రొయ్యల ఆహారం
  • డైమండ్‌ల తయారీ వస్తువులు

ధరలు పెరిగేవి..

  • బంగారం, వెండి, ఆభరణాలు
  • టైర్లు
  • సిగరెట్లు
  • వజ్రాలు
  • బ్రాండెడ్ దుస్తులు
  • విదేశాల నుంచి దిగుమతి అయ్యే రబ్బరు
  • దిగుమతి చేసుకునే ఎలక్ట్రిక్ చిమ్నీలు
  • రాగి తుక్కు

Read more RELATED
Recommended to you

Exit mobile version