శుభవార్త.. కోవిడ్‌ చికిత్సకు ఆ మెడిసిన్‌కు అనుమతి..

-

కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ మరో మెడిసిన్‌ను కోవిడ్‌ 19 చికిత్స కోసం వాడవచ్చని అనుమతులు జారీ చేసింది. డెక్సామిథాసోన్‌ అనబడే స్టెరాయిడ్‌ను కోవిడ్ మధ్యస్థ, తీవ్రమైన లక్షణాలు ఉన్న పేషెంట్లకు ఇవ్వవచ్చని తెలిపింది. అలాగే ఆక్సిజన్‌ సపోర్ట్‌పై తీవ్రమైన వాపు సమస్య ఉన్న కోవిడ్‌ పేషెంట్ల చికిత్సలోనూ ఈ స్టెరాయిడ్‌ను వాడవచ్చని తెలిపింది. ఈ మేరకు ఆ శాఖ ట్వీట్‌ చేసింది.

కోవిడ్‌ 19 చికిత్స కోసం క్లినికల్‌ మేనేజ్‌మెంట్‌ ప్రోటోకాల్‌ను మార్చాం. డెక్సామిథసోన్‌ అనే స్టెరాయిడ్‌ను మిథైల్‌ప్రెడ్నిసొలోన్‌కు ప్రత్యామ్నాయంగా.. కోవిడ్‌ చికిత్సకు వాడవచ్చు.. అని కేంద్ర ఆరోగ్యశాఖ ట్వీట్‌ చేసింది. కాగా ప్రస్తుతానికి కోవిడ్‌ను కట్టడి చేసేందుకు నిర్దిష్టమైన మెడిసిన్‌, వ్యాక్సిన్‌ ఏమీ రాలేదు. కానీ పలు యాంటీ వైరల్‌ మెడిసిన్లను కోవిడ్‌ చికిత్సకు వాడుతున్నారు. ఈ క్రమంలో కొత్తగా ఈ స్టెరాయిడ్‌ను కోవిడ్‌ చికిత్సకు అనుమంతించడంతో ఎంతో మందికి లాభం కలుగుతుందని వైద్య నిపుణులు అంటున్నారు.

కాగా డెక్సామిథసోన్‌ను 1960లలో అభివృద్ధి చేశారు. దీన్ని తీవ్రమైన వాపు సమస్య ఉన్న పేషెంట్లకు ఇస్తున్నారు. ప్రపంచ ఆరోగ్యం సంస్థ 1977 నుంచి ఈ మెడిసిన్‌ను అత్యవసర మెడిసిన్ల జాబితాలోకి చేర్చింది. ఇక ఈ మెడిసిన్‌ ధర కూడా చాలా తక్కువ కావడం, అన్ని దేశాల్లోనూ ఈ మెడిసిన్‌ దాదాపుగా లభిస్తుండడం, కోవిడ్‌ ఎమర్జెన్సీ పేషెంట్లు చనిపోకుండా చూడడంలో ఈ మెడిసిన్‌ ఉపయోగపడుతుందని తెలియడంతో ఇప్పటికే అనేక దేశాల్లో దీన్ని వాడుతున్నారు. ఇకపై మన దేశంలోనూ ఈ మెడిసిన్‌ను వాడనున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version