జీహెచ్ఎంసీ మేయర్ పీఠం బీజేపీదే అని కేంద్ర హోం శాఖా మంత్రి అమిత్ షా అన్నారు. హైదరాబాద్ ప్రజలు బీజేపీ రావాలని కోరుకుంటున్నారు అని ఆయన వ్యాఖ్యలు చేసారు. మేయర్ పీఠం కోసమే పోటీలో ఉన్నాం అని స్పష్టం చేసారు. ఫాంహౌస్ నుంచి ముఖ్యమంత్రి బయటకు రావాలి అని ఆయన డిమాండ్ చేసారు. మెట్రో రైలుకు నిధులు కేంద్రమే ఇచ్చింది అని ఆయన పేర్కొన్నారు.
మూసీనది వెంట ఆరు లైన్ల రోడ్డు ఏమైంది.. హుస్సేన్ సాగర్ ప్రక్షాళన ఎంత వరకు వచ్చిందో సీఎం చెప్పాలి అని ఆయన డిమాండ్ చేసారు. బీజేపీకి ఒక్కసారి అవకాశం ఇచ్చి చూడాలని హైదరాబాద్ ప్రజలకు విజ్ఞప్తి చేసారు. హైద్రాబాద్ నాలాలపై అక్రమ కట్టడాలను తొలగించే పనిని బీజేపీ చూసుకుంటోంది అన్నారు. ఆరేళ్ళుగా టీఆర్ఎస్ ప్రభుత్వం నాలాలను పట్టించుకోలేదు అని, హైద్రాబాద్ ఐటి హబ్ కు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకొస్తాం అని ఆయన అన్నారు. రోహింగ్యాల గురించి ఒవైసీ పార్లమెంట్ లో ఎందుకు మాట్లాడటం లేదని ఆయన ప్రశ్నించారు.