Breaking : ఏపీకి కేంద్ర షాక్‌.. కొత్త రైల్వే ప్రాజెక్టులు ఇవ్వలేమన్న కేంద్రమంత్రి

-

ఏపీ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం షాకిచ్చింది. ఆంధ్రప్రదేశ్‌కు నూతన రైల్వే ప్రాజెక్టులను కేటాయించలేమని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ పార్లమెంట్‌లో ప్రకటించారు. కేంద్రం, రాష్ట్రాలు వ్యయాన్ని భరించేలా కొత్త రైల్వే ప్రాజెక్టులను చేపడుతున్నామన్న మంత్రి.. ఏపీ ప్రభుత్వం తన వాటా నిధులు ఇవ్వకపోడంతో ఈ పరిస్థితి తలెత్తిందన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో రూ.70 వేల కోట్ల విలువైన రైల్వే ప్రాజెక్టులు కొనసాగుతున్నాయని అశ్విని వైష్ణవ్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా ఇవ్వాల్సిన రూ.1798 కోట్ల బకాయిలను ఇవ్వలేదన్నారు అశ్విని వైష్ణవ్.

ఇలాంటి పరిస్థితుల్లో నూతన ప్రాజెక్టులను ప్రకటించడం సాధ్యం కాదని స్పష్టం చేశారు అశ్విని వైష్ణవ్ . పెండింగ్ రైల్వే ప్రాజెక్టుల విషయమై మచిలీపట్నం ఎంపీ బాలశౌరి అడిగిన ప్రశ్నకు సమాధానంగా అశ్వినీ వైష్ణవ్ ఈ వివరాలను వెల్లడించారు. ఏపీకి కొత్త ప్రాజెక్టులు అడుగుతున్న ఎంపీ.. రైల్వే ప్రాజెక్టులకు ఆ రాష్ట్రం ఇవ్వాల్సిన నిధులను విడుదల చేసేలా.. కేంద్రానికి సహకరించేలా తమ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పిస్తే.. ప్రస్తుతం కొనసాగుతున్న ప్రాజెక్టులైనా ముందుకు వెళ్తాయని తెలిపారు అశ్విని వైష్ణవ్.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version