తెలంగాణకు కేంద్రం మరో షాక్ ఇచ్చింది. కాచిగూడ, సికింద్రబాద్ , నాంపల్లి స్టేషన్ లని విస్తరించే అవకాశం లేదని తేల్చి చెప్పింది. చర్లపల్లి రైల్వే టెర్మినల్ పనులను పరిశీలించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. ఈ సందర్భంగా మాట్లాడుతూ… కాచిగూడ, సికింద్రబాద్ , నాంపల్లి స్టేషన్ లని విస్తరించే అవకాశం లేదు… అందుకే చర్లపల్లి లో టెర్మినల్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
ఆధునిక హంగులతో , నూతన సాంకేతిక పరిజ్ఞానం తో నిర్మాణం చేపడుతున్నామని.. సుమారు 300 కోట్లతో నిర్మాణం ఉంటుందన్నారు. డిసెంబర్ 2023 వరకు పనులు పూర్తి చేస్తామని.. భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకొని రీజినల్ రింగ్ రోడ్… తెలంగాణ ప్రజలకు మోడీ ఇచ్చిన బహుమతి అన్నారు. చర్లపల్లి రైల్వే టెర్మినల్ ఏర్పాటు అయితే చుట్టు పక్కల జిల్లాల ప్రజలకు ప్రయాణం సులభం అవుతుంది.. సికింద్రబాద్ రైల్వే స్టేషన్ 600 కోట్లతో ఆధునీకరణ చేస్తామన్నారు. కాజీపేట రైల్వేస్టేషన్ ఆధునీకరణ కూడా చేయాలని కేంద్రం నిర్ణయించింది…వరంగల్ లో రైల్వే కోచ్ ఓవరలింగ్ యూనిట్ కి మరికొంత లాండ్ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సి ఉందని వివరించారు.