బడ్జెట్ ప్రవేశ పెట్టిన తరవాత దేశ వ్యాప్తంగా చర్చలు నిర్వహిస్తున్నాం. మొదట ముంబాయి లో, రెండో చర్చ విశాఖలో నిర్వహించాం అని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. విశాఖ లో బడ్జెట్ పై వివిధ వర్గాల ప్రజలను కలసి వారి సలహాలు, సూచనలు తీసుకున్నాం. పోలవరం ప్రాజెక్ట్ కి అధిక ప్రాధాన్యత ఇచ్చాం. కేంద్ర ప్రభుత్వంగా కాదు, మా బాధ్యత గా సహకారం అందిస్తున్నాం.
విశాఖ స్టీల్ ప్లాంట్ కు ఎక్కువ మొత్తం కేటాయించాం. స్టీల్ ప్లాంట్ ను పునరాభివృద్ది చేయడానికి 11 వేల కోట్లు సహకారం అందిస్తున్నాము. పారిశ్రామిక కారిడార్ కు కేంద్ర ప్రభుత్వం నుంచి అమరావతి రాజధానికి కూడా సహకారం అందిస్తున్నాం. కేంద్రం ,రాష్ట్రం కలిసి చేస్తున్న అన్ని ప్రాజెక్టులకు లోటు లేకుండా కేటాయింపులు చేస్తున్నాం. సాంకేతిక సమస్యలు వలన పోలవరం ప్రాజెక్ట్ ఆలస్యం అవుతుంది. విభజన సమయంలో పోలవరం పూర్తి చేస్తామని హామీ ఇచ్చాము. ఖచ్చితంగా పోలవరం ప్రాజెక్ట్ ను పూర్తి చేస్తాం అని నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు.