పొరపాటున కూడా వీటిని జేబులో పెట్టకండి.. జీవితంలో ఎన్నో సమస్యలు వచ్చే ఛాన్స్..!

-

వాస్తు శాస్త్రంలో చెప్పినటువంటి నియమాలను పాటించడం వలన జీవితంలో సానుకూల శక్తి పెరుగుతుంది. ఈ విధంగా ప్రతిరోజు ఆనందంగా ఉండవచ్చు. అయితే వాస్తు నిపుణులు ప్రకారం జేబులో కొన్ని వస్తువులను ఉంచకూడదు. ఎప్పుడైతే ఇటువంటి చిన్న చిన్న విషయాల పై శ్రద్ధ చూపించరో జీవితంలో ఎన్నో పెద్ద సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. కనుక ఈ వస్తువులను అస్సలు జేబులో పెట్టకండి. సహజంగా ఎన్నో వస్తువులను మన జేబులో ఉంచుతాం, అయితే అవి ఎన్నో అశుభ ఫలితాలను కూడా ఇస్తాయి మరియు కొన్ని వస్తువులు మాత్రం జేబులో పెట్టడం వలన సంపద పెరుగుతుంది.

దీంతో ఎంతో ఆనందంగా ఉంటారు. సహజంగా జేబులో పాత బిల్లులు, చిరిగిపోయిన నోట్లు, విజిటింగ్ కార్డులు వంటివి ఎన్నో రోజుల పాటు ఉంచుతూ ఉంటాం. కాకపోతే వాటి వలన నెగెటివిటీ పెరిగిపోతుంది. అదే విధంగా అవసరమైన డాక్యుమెంట్లు ఒకే దగ్గర ఉండవు. కనుక అవసరమైనటువంటి డాక్యుమెంట్లను ఫైల్ చేసి ఉంచుకోవాలి. ఇటువంటి చిన్న చిన్న మార్పుల వలన ఎంతో సంతోషాన్ని, సంపదను పొందవచ్చు. జేబులో మందులు ఉంచడం వలన పాజిటివ్ ఎనర్జీ తగ్గిపోతుంది మరియు ఆరోగ్యం పై కూడా ఎంతో ప్రభావం చూపుతుంది. కనుక మీ జేబులో మందులను ఉంచవద్దు.

చాలా మంది వాలెట్ చిరిగిపోయిన సరే దానిని మార్చారు. చిరిగిపోయిన పర్సును జేబులో ఉంచడం వలన ఎంతో నెగటివ్ ఎనర్జీ ఉంటుంది మరియు ఎన్నో ఆర్థిక సమస్యలను కూడా ఎదుర్కొంటారు. కనుక కొత్త పర్సులను ఉపయోగించి ఆర్థికంగా దృఢంగా అవ్వండి. వాస్తు శాస్త్రం ప్రకారం జేబులో అసూయ, కోపం యొక్క భావాలను తెలియజేసే చిత్రాలను ఉంచడం వలన ప్రతికూల శక్తి ఎక్కువగా ఉంటుంది. దీంతో జీవితంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటారు. సహజంగా ధార్మిక ప్రదేశాలను సందర్శించినప్పుడు దేవుడు తాళ్లు వంటివి జేబులో ఉంచుతారు. అటువంటి తాడులను కేవలం పవిత్ర ప్రదేశాలలో మాత్రమే ఉంచాలి. కనుక సానుకూలతను పెంచాలంటే వీటిని జేబులో అస్సలు ఉంచవద్దు.

Read more RELATED
Recommended to you

Latest news