ధెర్మోమీటర్లో ఒకప్పుడు పాదరసం బదులు బ్రాందీ వాడేవారట.. ఇంకా హైలెట్ ఏంటంటే..!

-

మనకు తెలియని విషయాలు ఈ ప్రపంచంలో చాలా ఉన్నాయి.. అందరికి అన్నీ తెలియాలని లేదు.. కానీ తెలుసుకోవాలని అయితే ఉంటుంది కదా.. మనం పుట్టకముందు ఏం జరిగిందో తెలుసుకోవడం చరిత్ర అయితే..మనతో పాటు ఇప్పుడు ఏం జరుగుతుందో తెలుసుకోవడం జ్ఞానాన్ని పెంచుకోవడమే అవుతుంది. ఆసక్తికరమైన విషయాలు మీకు ఎన్ని తెలిస్తే.. అంత చురుకుగా మీ మెదడు పనిచేస్తుంది. కళ్లును చూస్తే అవి చేసే పనులు మనకు అస్సలు తెలియవు.. కానీ ప్రతి సెకండ్ కు 50 కదలకిలు వస్తాయట.. అంత ఫాస్ట్ గా వర్క్ జరుగుతుంది.. ఇలాంటి ఇంకొన్ని ఆసక్తికరమైన విషయాలు చూద్దామా..!
కంటిలో ప్రతి సెకండ్‌కీ 50 కదలికలు వస్తాయి.
నత్త మూడేళ్లపాటూ నిద్రపోగలదట.
 కంగారూలు చనిపోయేవరకూ పెరుగుతూనే ఉంటాయట.
ధెర్మోమీటర్ల (thermometers)లో పాదరసం (mercury) వాడకముందు బ్రాందీ (brandy)ని నింపేవారు. ఇదేదో భలే ఉందే.
 కూరగాయల్ని చూసి భయపడటాన్ని లచానోఫోబియా (Lachanophobia) అంటారు. ఓర్ని ఇలాంటి వాళ్లు కూడా ఉంటారా..!
మగవాళ్ల కంటే ఆడవాళ్లు రంగులను బాగా గుర్తించగలరు. మగవాళ్లు వేగంగా కదిలేవాటిని బాగా ట్రాక్ చెయ్యగలరు. దూరం నుంచి కూడా అత్యంత పరిశీలనగా చూడగలరు. అమ్మో తెలివైనవాళ్లే..!
ఈఫిల్ టవర్ (Eiffel Tower) ని మొదట స్పెయిన్‌లోని బార్సెలోనా (Barcelona)లో నిర్మించాలనుకున్నారు. కానీ ఈ ప్రాజెక్టును అక్కడి ప్రజలు తిరస్కరించారట. చూడటానికి అది బాగోదు అనుకున్నారు. పాపం వాళ్లు చారిత్రక తప్పుడు నిర్ణయం తీసుకున్నారు కదా..!
గుంపుగా ఉన్న గుర్రాలు అన్నీ ఒకేసారి నిద్రపోవు. వాటిలో ఒక్కటైనా మెలకువగా ఉంటుంది. అది మిగతా వాటికి కాపలాగా ఉంటుందట. మంచి యూనిటీ ఉంది కదా.!
జెల్లీఫిష్ (Jellyfish)లకు చావు ఉండదు. వాటికి వయసు ఉండదు. వాటికి ఎవరూ హాని చెయ్యకపోతే… అవి ఎప్పటికీ చనిపోవట.
చీకట్లో మెరిసే పుట్టగొడుగుల్లో (mushrooms) 70 రకాల జాతులున్నాయి.
కాకులు మనుషుల ముఖాలను గుర్తుపట్టగలవు. అవి మనుషులపై పగ పెంచుకోగలవు. వామ్మో జాగ్రత్తండోయ్.
ఈ భూమిపై అన్ని బీచుల్లోని ఇసుక రేణువుల కంటే ఎక్కువ నక్షత్రాలు అంతరిక్షంలో ఉన్నాయి.
ఒంటె పాలు పెరుగు అవ్వవట.
ప్రస్తుతం షార్క్ చేపల దాడుల వల్ల సంభవిస్తున్న మరణాల కంటే.. సెల్ఫీ మరణాలే ఎక్కువగా జరుగుతున్నాయి. కదా తరచూ చూస్తూనే ఉన్నాం సెల్ఫీ ఘటనలు.
1687కి ముందు గడియారాలలో గంటల ముల్లు మాత్రమే ఉండేదట.
కాంతి తక్కువగా ఉన్న లైట్లు మీకు ఆకలి వెయ్యనివ్వవు.
ప్రాచీన రోమన్లు… అన్ని రకాల విషాలకూ విరుగుడుగా నిమ్మకాయలను వాడేవారట.
మీమ్స్ (memes)ని అధ్యయనం చేయడం కోసం ఇండియానా యూనివర్శిటీకి అమెరికా ప్రభుత్వం $1 మిలియన్ (రూ.7.76 కోట్లు) ఇచ్చింది.
-Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Exit mobile version