అన్ స్టాపబుల్ : సంక్రాంతికి సందడి చేయనున్న వీరసింహారెడ్డి టీమ్..ప్రోమో వైరల్..!

-

వెండితెర పైనే కాదు బుల్లితెరపై కూడా తన సత్తా చాట గలిగిన స్టార్ హీరో బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఇకపోతే తాజాగా ఈయన నటించిన వీర సింహారెడ్డి సినిమా ఈరోజు ఉదయం విడుదలై మంచి విజయంతో దూసుకుపోతోంది. ఇకపోతే ఒకవైపు వరుస సినిమాలలో బాలకృష్ణ దూసుకుపోతుంటే.. మరొకవైపు బుల్లితెర షోలు చేస్తూ దూసుకుపోతున్నారు. ఈ క్రమంలోనే ఆహా వేదికపై తన చిత్ర బృందంతో సందడి చేయడానికి సిద్ధమవుతున్నాడు బాలకృష్ణ. ఇకపోతే 2023 సంక్రాంతి బరిలో విడుదలైన వీరసింహారెడ్డి ప్రచారంలో భాగంగా ఓటీటీ టాక్ షో అన్ స్టాపబుల్ విత్ ఎన్ బీ కే అదనపు బూస్ట్ ఇస్తోంది.

ఇకపోతే తాజాగా అన్ స్టాపబుల్ షో నుంచి విడుదలైన ప్రోమో ఇప్పుడు వైరల్ గా మారుతుంది. ముఖ్యంగా తాజా ఎపిసోడ్ లో వీరసింహారెడ్డి నటీమణులు హనీ రోజు , వరలక్ష్మి శరత్ కుమార్ తో పాటు దర్శకుడు గోపీచంద్ మల్లినేని నిర్మాత నవీన్ ఎర్నేని తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తాజాగా ఎపిసోడ్ నుంచి విడుదలైన ప్రోమో నెట్టింట వైరల్ గా మారుతుంది మరొకవైపు వీరసింహారెడ్డి గురించి హోస్ట్ బాలకృష్ణ.. అతిథుల మధ్య వినోదాత్మక చర్చలు ప్రోమోలో ఆసక్తిని కలిగించాయి. సినిమాలో తన పాత్ర ఎలా ఉండబోతుందో అని చెబుతూ ప్రేక్షకులకు దించారు బాలయ్య.

అలాగే గోపీచంద్ మలినేని కెరియర్ జర్నీలో ఏర్పడిన ఇబ్బందుల గురించి ఆస్తి అమ్మకాల గురించి కూడా బాలయ్య బాబు ఎపిసోడ్లో ప్రశ్నించారు అలాగే వరలక్ష్మి కూడా ఎనర్జిటిక్ గా వేదికపై కనిపించింది. మొత్తానికి అయితే ఈ ఆసక్తికర ఎపిసోడ్ సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రేక్షకులను అలరించడానికి సిద్ధం అవుతుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version