యాసంగి సాగు పంట చేతికొచ్చి పంటను అమ్ముకుందాం అనుకునేలోపు రైతులకు వరుణుడు కన్నీళ్లను మిగిల్చాడు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో అకాల వర్షానికి వ్యవసాయ మార్కెట్లో ధాన్యం కొట్టుకుపోయింది. దీంతో రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు.
ఈ విషాద ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్, సంస్థాన్ నారాయణపురం, భూదాన్ పోచంపల్లిలో ఆదివారం ఉదయం వెలుగుచూసింది.నేడు కురిసిన భారీ వర్షానికి ఐకేపీ సెంటర్లలోని వడ్లు పూర్తిగా తడిచిపోయాయి. వ్యవసాయ మార్కెట్లో ధాన్యం వర్షపు నీటిలో కొట్టుకుపోతున్నది. దీంతో రైతులు ధాన్యాన్ని నీటి నుంచి ఎత్తి పోస్తున్నారు.ఈ కన్నీటి దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.