బీఆర్ఎస్ రజతోత్సవ సభ నేడు హన్మకొండ జిల్లా ఎల్కతుర్తితో జరగనున్న విషయం తెలిసిందే. సాయంత్రం 4 గంటల ప్రాంతంలో మాజీ సీఎం,బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హెలికాప్టర్‌లో సభా ప్రాంగణం వద్దకు చేరుకుంటారు. ఇప్పటికే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. పబ్లిక్ గార్డెన్ వద్దగల అమరవీరుల స్థూపానికి నమస్కరించి సభకు హాజరయ్యేందుకు రోడ్డు మార్గంలో బయలుదేరారు..
అదేవిధంగా రాష్ట్ర నలమూలల నుంచి బీఆర్ఎస్ శ్రేణులు ప్రైవేట్ వాహనాల్లో ఎల్కతుర్కికి బయలుదేరారు. ఈ క్రమంలోనే మార్గమధ్యలో టోల్ సిబ్బంది పై బీఆర్ఎస్ నేతల దౌర్జన్యం చేసినట్లు తెలుస్తోంది. టోల్ ఛార్జీలు చెల్లించమని అడిగినందుకు సిబ్బందిని బండ బూతులు తిట్టి వారిపై వరంగల్ వెళ్తున్న బీఆర్ఎస్ నేతలు దాడికి యత్నించినట్లు సమాచారం. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.