బీఆర్ఎస్ సభకు హాజరయ్యేందుకు రాష్ట్రంలోని నలుమూలల నుంచి గులాబీ శ్రేణులు తరలివెళ్తున్నారు. అందులో మాజీ మంత్రులు,ఎమ్మెల్యేలు, మాజీలు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్సీలు, సీనియర్ నేతలు సైతం ఉన్నారు. మాజీ ఐపీఎస్, బీఆర్ఎస్ కీలక నేత, గురుకులాల మాజీ కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సైతం సభకు బయలుదేరారు.
కారులో ఒపెన్ రూఫ్ నుంచి బయటకు వచ్చిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఓ చేత్తో గులాబీ జెండా పట్టుకుని ఎల్కతుర్తికి బయలుదేరారు. ఈ క్రమంలోనే ఆయన పనితీరు మీద తన ఫాలోవర్ ఓ ట్వీట్ చేశారు. నిన్న ఎల్కతుర్తిలో వాలంటీర్లకు దిశా నిర్దేశం,సాయంత్రం కాగజ్ నగర్ నియోజకవర్గం నుండి జనసమీకరణ ఏర్పాట్లు, ఉదయం జెండా ఆవిష్కరణలు ర్యాలీలు..ఎక్కడ ఉన్నా, ఏ బాధ్యతలో ఉన్నా దానికి 100 శాతం న్యాయం చేయడానికి ప్రాణం పెట్టి పని చేసే అరుదైన నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అని రాసుకొచ్చారు.