BREAKING : పాదాచారులపైకి దూసుకెళ్లిన బస్సు..5 గురు మృతి

-

దేశంలో రోడ్డు ప్రమాదాలు విపరీతంగా పెరిగి పోతున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నిక కఠినమైన నిబంధనలు అమలు చేసినా.. ప్రమాదాలు ఎక్కడా తగ్గడమే లేదు. తాజాగా ఉత్తర ప్రదేశ్‌ లోని కాన్పూర్‌ లో ఓ ఎలక్ట్రిక్‌ బస్సు బీభత్సవం సృష్టించింది. కాన్పూర్‌ లో అదుపుతప్పిన బస్సు మూడు కార్లు, పలు మోటారు సైకిళ్లను ఢీకొట్టింది. పాదచారులపైకి దూసుకెళ్లడంతో.. ఐదుగురు అక్కడిక్కడే మృతి చెందారు.

చాలా మంది గాయపడ్డారు. బీభత్సం సృష్టించిన బస్సు.. చివరికీ ఓ లారీని గుద్ది ఆగి పోయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించామని పోలీసులు చెప్పారు. బస్సు డ్రైవర్‌ పరారీలో ఉన్నాడని.. అతని కోసం వెతుకుతున్నామని చెప్పారు పోలీసులు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేస్తున్నామన్నారు. త్వరలోనే నిందితున్ని పట్టు కుంటామని వెల్లడించారు.  ఇక ఈ సంఘటన పై వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version