రాహుల్ గాంధీ లఖింపూర్ ఖేరీ పర్యటనకు అనుమతి

-

కాంగ్రెస్ లీడర్ రాహుల్ గాంధీ లఖింపూర్ ఖేరీ పర్యటనకు అనుమతి ఇచ్చారు యూపీ పోలీసులు. కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ తో పాటు, మరో ముగ్గురు లఖింపూర్ ఖేరీని సందర్శించడానికి యూపీ పోలీసులు అనుమతి ఇచ్చారు. మృతి చెందిన నలుగురు రైతుల కుటుంబాలను పరామర్శించేందుకు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఇతర ప్రతిపక్ష నాయకులను అనుమతించారు యూపీ పోలీసులు.

దీంతో కాసేపటి క్రితమే రాహుల్ గాంధీ, చత్తీస్ఘడ్ సీఎం భుపేష్ బగేల్, పంజాబ్ సీఎం చరణ్ జిత్ సింగ్ చన్నీ లక్నో చేరుకున్నారు. లక్నో నుంచి నేరుగా లఖింపూర్ ఖేరీ కి వెళ్లనుంది రాహుల్ గాంధీ బృందం. కాగా లఖింపూర్ ఖేరీ వెళ్లేందుకు అనుమతి ని నిరాకరిస్తూ ప్రియాంక గాంధీ ని సోమవారం పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.

ఇక ఈరోజు ఉదయం, రాహుల్ గాంధీ, ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ , పంజాబ్ సీఎం చరణ్‌జిత్ ఛన్ని, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కెసి వేణుగోపాల్, సచిన్ పైలట్ లను ఢిల్లీ—లక్నో విమానం ఎక్కకుండా కొద్దిసేపు అడ్డుకున్నారు పోలీసులు. కానీ చివరకు అనుమతి ఇచ్చారు పోలీసులు.

Read more RELATED
Recommended to you

Exit mobile version