నిన్న యూపీలో జరిగిన హింసాకాండలో నలుగురు రైతులతో పాటు 8 మంది మరణించిన సంగతి తెలిసిందే. కేంద్ర మంత్రి కొడుకు వాహనం ఢీకొని పలువురు మరణించంతో ఉద్రిక్తత తలెత్తింది. దీంతో లఖీంపూర్ ఖేరీ లో యూపీ ప్రభుత్వం హైలర్ట్ ప్రకటించింది. రైతులు మరణించిన ఘటనపై విపక్షాలు నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది. కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ, చత్తీస్గడ్ సీఎంలు రైతుల కుటుంబాలను పరామర్శించడానికి సంఘటన జరిగిన ప్రాంతాలకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. దీంతో యూపీ పోలీసులు అప్రమత్తమై ప్రియాంకగాంధీని అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఆమె బీజేపీ ప్రభుత్వంపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు. బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు వెళ్తుంటే అడ్డుకోవడం దారుణమని అన్నారు.
దేశం రైతులది.. బీజేపీది కాదు.- ప్రియాంక గాంధీ.
-