రోజుకు రూ.1తో రూ.4 లక్షల బెనిఫిట్..!

-

మీకు బ్యాంక్ ఖాతా వుందా..? అయితే తప్పక మీరు ఇది చూడాలి. అతి తక్కువ మొత్తంతోనే అదిరే బెనిఫిట్ ని ఈజీగా పొందొచ్చు. దీని వలన మీకు ఆర్ధిక భద్రత కూడా ఉంటుంది. ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాల లోకి వెళితే.. బరోడా బ్యాంక్ ట్విట్టర్ వేదికగా ఒక విషయాన్ని వెల్లడించింది. దీని వలన అకౌంట్ ఉన్న వాళ్లకి ప్రయోజనకరంగా ఉంటుంది. కేంద్రం ఎన్నో రకాల స్కీమ్స్ ని అందిస్తోంది.

money

అయితే ఆ స్కీమ్స్ లో ప్రధాన్ మంత్రి జీవన్ జ్యోతి బీమా, ప్రధాన్ మంత్రి సురక్ష బీమా యోజన పథకాలు కూడా వున్నాయి. అయితే ఇవి బ్యాంకుల్లో అందుబాటులో ఉన్నాయి. వీటిల్లో చేరడం వల్ల ప్రయోజనం పొందొచ్చు. అయితే ఎలా లాభదాయకంగా ఉంటుంది..?, ఎంత కట్టాలి..? ఈ వివరాలని చూస్తే.. నెలకు రూ.28 వరకు ఆదా చేస్తే ఈ రెండు స్కీమ్స్‌లో చేరడం చేరి సంవత్సరానికి రూ.342 కట్టచ్చు. అంటే రోజుకు రూ.1 పొదుపు చేస్తే సరిపోతుందని చెప్పుకోవచ్చు.

బ్యాంక్ ఖాతా ఉన్న వారు ఈ పథకంలో చేరొచ్చు. డబ్బులు ఆటోమేటిక్‌గానే అకౌంట్ నుంచి కట్ అవుతాయి. జీవన్ జ్యోతి బీమా స్కీమ్ అనేది లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ. ఈ స్కీమ్ కింద ఏడాదికి రూ.330 చెల్లించాలి. ఒకవేళ కనుక పాలసీదారుడు మరణిస్తే.. కుటుంబానికి రూ.2 లక్షలు వస్తాయి. ఇది ఇలా ఉంటే సురక్ష బీమా యోజన అనేది ప్రమాద బీమా. దీనికి ఏడాదికి రూ.12 కట్టాలి. ప్రమాదంలో మరణించినా, లేదంటే అంగవైకల్యం సంభవించినా రూ.2 లక్షల దాక ఇవ్వడం జరుగుతుంది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version