ఉత్తర్ ప్రదేశ్ లో దారుణం జరిగింది. బీజేపీ తరుపున ప్రచారం చేయడమే పాపం అయింది. బీజేపీ తరుపున ప్రచారం చేసినందుకు ఓ ముస్లిం యువకుడిని కొట్టి చంపారు. మరణించిన వ్యక్తిని బాబర్ గా గుర్తించారు. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ కుషీ నగర్ జిల్లా పోలీస్ స్టేషన్ పరిధిలోని కథ్ఘార్హీ గ్రామంలో చోటు చేసుకుంది. మరణించిన వ్యక్తి ఇటీవల ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికల్లో బీజేపీ తరుపున ప్రచారం చేశారు. బీజేపీ గెలిచి, యోగీ అధికారంలోకి రావడంతో స్వీట్లు కూడా పంచారు. అయితే అదే వర్గానికి చెందిన వ్యక్తులు బీజేపీకి సపోర్ట్ చేయవద్దని బాబర్ ను పలుమార్లు హెచ్చిరించారు, చంపుతామని బెదిరించారు. అయితే ఈ బెదిరింపులపై గతంలో బాబార్ పోలీసులకు ఫిర్యాదు చేసినా… పట్టించుకోలేదని బాబర్ సోదరుడు అలాం అన్నారు.
ఇటీవల బాబర్ వర్గానికి చెందిన స్థానికులు బాబర్ ని చుట్టుముట్టి విచక్షణ రహితంగా దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన బాబర్ ని మొదట జిల్లా ఆసుపత్రికి, ఆపై లక్నో ఆసుపత్రికి తరలించారు.. అయితే ఈ క్రమంలో చికిత్స పొందుతూ.. మార్చి 25న బాబర్ మరణించారు. ఈ ఘటనలో పోలీసులు ఇప్పటివరకు ఆరిఫ్, తాహిర్ అనే ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు మరియు ఇతరుల కోసం వేట కొనసాగిస్తున్నారు. బాబార్ మరణంపై స్థానిక బీజేపీ ఎమ్మెల్యే పీఎన్ పాఠక్ మాట్లాడుతూ… నిందితులపై చర్యలు తీసుకుంటామని… మరోసారి ఇలాంటి ఘటనలకు పాల్పడాలంటే భయపడేలా చేస్తాం అంటూ హెచ్చరించారు. ఈ ఘటనపై యూపీ సీఎం ఆఫీస్ కూడా స్పందించింది. ఘటనకు కారకులైన వారిని కఠినంగా శిక్షిస్తామని తెలిపింది.