అరుదైన గౌరవాన్ని దక్కించుకున్న ఉపాసన.. ఆసియాలోనే!

-

మెగా కోడలు, అపోలో హాస్పిటల్ చైర్మన్ ప్రతాప్.సి రెడ్డి మనవరాలు ఉపాసన తనదైన ముద్ర వేస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఉపాసన ఓ అరుదైన గౌరవాన్ని దక్కించుకున్నారు.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భార్య ఉపాసన గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరమే లేదు. అపోలో ఫౌండేషన్ వైస్ చైర్ పర్సన్ గా బిజీ జీవితాన్ని గడుపుతూనే సేవా రంగంలో సైతం తనదైన ముద్ర వేశారు. మెగా ఫ్యామిలీని, అపోలో హాస్పిటల్స్ నడుపుకుంటూ వస్తున్న ఉపాసన వ్యక్తిత్వం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే తాజాగా ఉపాసన ‘మోస్ట్ ప్రామిసింగ్ బిజినెస్ లీడర్స్ ఆసియా 2022-23’ జాబితాలో ఒకరుగా నిలిచారు. దీంతో మెగా అభిమానులతో పాటు పలువురు ప్రముఖులు సైతం ఉపాసనకు అభినందనలు తెలుపుతున్నారు. ఉపాసన చేసిన సేవలకు గాను ఈ అవార్డు లభించినట్టు టైమ్స్ ఆఫ్ ఇండియా వెల్లడించింది. అయితే దీనిపై స్పందించిన ఉపాసన కృతజ్ఞతలు తెలుపుతూ ట్వీట్ చేశారు.

వృత్తి, వ్యక్తిగత జీవితాన్ని సక్రమంగా నడిపిస్తున్న ఉపాసన తన వ్యాపార రంగంలో సైతం తనదైన ముద్ర వేశారు. సామాజిక కార్యక్రమాల్లో ఎంతో ఆసక్తిగా పాల్గొన్న ఉపాసన అపోలో హాస్పిటల్స్ కు వైస్ ప్రెసిడెంట్గా వ్యవహరిస్తూనే బి పాజిటివ్ అనే హెల్త్ మాగజైన్ కు ఎడిటర్ గా కూడా వ్యవహరిస్తున్నారు. అలాగే ఉపాసన ‘యు ఎక్స్చేంజ్’ అనే సేవా సంస్థ నెలకొల్పి పాత స్కూల్ పుస్తకాలు సేకరించి పేద పిల్లలకు ఇచ్చేవారు. మురికివాడల్లో అనారోగ్యంతో బాధపడే పిల్లలకు అపోలో హెల్త్ సిటీలో చికిత్స చేయించేవారు. కరోనా సమయంలో సైతం పలువురికి ఉచితంగా అపోలో ఆసుపత్రి నుంచి మందులు అందించారు ఉపాసన. ఇప్పటికే మెగా ఫ్యామిలీ మొత్తం ఉపాసన వ్యక్తిత్వాన్ని ఎంతగానో పొగిడే సంగతి తెలిసిందే. తాజాగా ఈ ఘనత సంపాదించుకున్న ఉపాసనను నెటిజన్లు పొగడ్తలతో ముంచెత్తుతున్నారు..

Read more RELATED
Recommended to you

Exit mobile version