పుట్టబోయే బిడ్డ గురించి ఉపాసన ఆసక్తికర ట్వీట్

-

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ – ఉపాసన దంపతులు త్వరలోనే తల్లిదండ్రులు కాబోతున్న సంగతి తెలిసిందే. ఈ విషయం అటు మెగా ఫ్యామిలీతో పాటు ఇటు అశేష అభిమాన వర్గాన్ని ఆనందంతో ముంచేత్తుతోంది. ఈ నేపథ్యంలో మరోసారి తనకు పుట్టబోయే బిడ్డ గురించి ప్రస్తావిస్తూ ఉపాసన ట్వీట్ చేసింది.

ఈ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ జంట 2002 డిసెంబర్ లో తల్లిదండ్రులు కాబోతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే గత కొద్ది కాలంగా ఈ జంట యునైటెడ్ స్టేట్స్ లో తమ మొదటి బిడ్డని కనేందుకు ప్లాన్ చేసుకుంటున్నారని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ వార్తలకు చెక్ పెట్టింది ఉపాసన. భారతదేశంలోనే మా మొదటి బిడ్డను స్వాగతించడానికి సిద్ధంగా ఉన్నామని ట్వీట్ చేసింది ఉపాసన.

“స్వదేశంలో మొదటి బిడ్డను ప్రసవించేందుకు నేను సంతోషిస్తున్నాను. మా జీవితంలోకి ఈ కొత్త దశ కోసం మేము చాలా నిరీక్షణతో ఎదురుచూస్తున్నాం. డాక్టర్ సుమన మనోహర్ మరియు డాక్టర్ రుమాసిన్హా అపోలో ఆసుపత్రులలో OB/ GYN బృందంలో భాగంగా ఉంటారు. అలాగే అమెరికా నుండి బోర్డు సర్టిఫైడ్ ప్రసూతి వైద్యురాలు జెన్నీఫర్ ఆస్టన్ కూడా మా బిడ్డ ప్రసవంలో భాగం అవుతారు” అని ట్వీట్ చేసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version