జనసేన కంటే టీడీపీ వైపే..పవన్ బీ అలెర్ట్!

-

జనసేన అధినేత పవన్ కల్యాణ్..ఈ సారి ఎన్నికల్లో కూడా సొంతంగా సత్తా చాటేలా కనిపించడం లేదు. మళ్ళీ ఏదొక పార్టీపై ఆధారపడి బండి లాగించడానికే ఆయన మొగ్గుచూపుతున్నట్లు కనిపిస్తున్నారు. 2014 ఎన్నికల ముందు జనసేన పార్టీ పెట్టారు. 2014 ఎన్నికల్లో పోటీ చేయకుండా టి‌డి‌పి-బి‌జే‌పిలకు మద్ధతు ఇచ్చారు. ఆ తర్వాత మూడేళ్లకు ఆ పార్టీలని వదిలేశారు. 2019 ఎన్నికల్లో పవన్..కమ్యూనిస్టులు, బి‌ఎస్‌పి లతో పొత్తు పెట్టుకుని పోటీ చేసి కేవలం ఒక సీటు గెలిచారు. పోటీ చేసిన రెండు చోట్ల పవన్ ఓడిపోయారు.

సరే తొలిసారి ఎన్నికల్లో దిగారు కదా..ఈ సారి మాత్రం సత్తా చాటుతారు అని పవన్ సి‌ఎం అయిపోతారని, పార్టీ శ్రేణులు, అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు. కానీ అందుకు తగ్గట్టుగా పవన్ పనిచేయట్లేదు..పార్టీ బలోపేతం అవ్వడం లేదు. గత ఎన్నికల్లో 6 శాతం ఓట్లు వచ్చాయి. ఇప్పుడు గట్టిగా చూసుకుంటే 10 శాతం వరకు వెళ్ళి ఉంటుంది. ఈ 10 శాతం ఓట్లతో జనసేన సాధించేది ఏమి లేదు..10 లోపే సీట్లు వస్తాయి. వాటితో చేసేదేమీ లేదు.

ఇదే సమయంలో టి‌డి‌పితో పొత్తుకు రెడీ అవుతున్నారు..పొత్తులో వాళ్ళు ఇచ్చిన సీట్లు తీసుకుని పోటీ చేయాలి..కొన్ని సీట్లని గెలుచుకుంటారు. అంతే తప్ప..జనసేన స్వతహాగా బలపడటం కష్టమవుతుంది. అసలే ఎన్నికలకు సమయం దగ్గర పడుతుంది. ఇంకా పవన్ ప్రజల్లో తిరగడం లేదు. ఏదో అప్పుడప్పుడు మాత్రమే ఆయన రాష్ట్రానికి వచ్చి వెళుతున్నారు. మిగతా పనులు నాదెండ్ల మనోహర్ చూసుకుంటున్నారు. ఆయన కూడా పార్టీని బలోపేతం చేయడంలో విఫలమవుతున్నారు.

కీలక నేతలని జనసేనలోకి తీసుకురాలేకపోతున్నారు. ముఖ్యంగా కాపు నేతలు టి‌డి‌పి వైపు చూస్తున్నారు గాని..జనసేన వైపు రాని పరిస్తితి. ఇలాగే ఉంటే రానున్న రోజుల్లో జనసేన బలపడటం చాలకష్టమైన పని..కాబట్టి పవన్ ఇప్పటికైనా మేల్కొని పార్టీని బలోపేతం చేయాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version