తనను హత్య చేసేందుకు కుట్రలు చేస్తున్నారని నిన్న బొంతు శ్రీదేవి ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆమె చేసిన వ్యాఖ్యలపై ఉప్పల్ ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి స్పందించారు. నా పై బోంతు శ్రీదేవి చేసిన ఆరోపణలపై ఆధారాలు బయట పెట్టాలన్నారు. బొంతు శ్రీదేవి నీ హత్య చేయించడానికి నాకేం అవసరం ? అని నిలదీశారు ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి.
ప్రోటోకాల్ బాధ్యత నాది కాదని.. మాజీ మేయర్ బొంతు రామ్ మోహన్ నా నియోజకవర్గంలో ఎలా ప్రారంభోత్సవాలు చేస్తారు ? అని నిలదీశారు ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి. రాజకీయంగా నన్ను ఎదుర్కోవాలి …అసత్య ఆరోపణలు చేసి కాదన్నారు. నా పై ఆరోపణలు చేయడం వెనుక ఎవరు ఉన్నారో అందరికీ తెలుసు, అనవసరంగా బొంతు శ్రీదేవి కుల రాజకీయాలు చేస్తున్నారని నిప్పులు చెరిగారు ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి.