ఉప్పెన హీరోయిన్.. ఈ సారి తెలంగాణ అమ్మాయిగా!

-

మొదటి సినిమాతోనే స్టార్ డమ్ దక్కించుకోవడం అంటే మామూలు విషయం కాదు. చాలా కొద్ది మందికి మాత్రమే ఆ అదృష్టం దక్కుతుంది. అలాంటి అదృష్టాన్ని తమ జేబులో నింపుకున్నవారిలో ఉప్పెన హీరోయిన్ క్రితిశెట్టి ఒకరు. మెగా మేనల్లుడు పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా నటించిన ఈ సినిమాలో క్రితిశెట్టి హీరోయిన్ గా కనిపించి అందరి మనసులని కొల్లగొట్టేసింది. దాంతో తనకి ఆఫర్లు వెల్లువలా వచ్చి పడుతున్నాయి. తాజాగా సుధీర్ బాబు హీరోగా రూపొందుతున్న సినిమాలో హీరోయిన్ గా ఎంపికైంది.

మోహనక్రిష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో “ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి” అనే టైటిల్ తో షూటింగ్ మొదలైన చిత్రంలో క్రితిశెట్టి హైదరాబాద్ అమ్మాయిగా కనిపించి, తెలంగాణ మాండలికంలో మాట్లాడనుందట. జ్వరం కావాలా నీకు అని క్యూట్ గా పలుకుతూ ఉప్పెనలో మతి పోగొట్టిన క్రితి, ఈ సారి తెలంగాణ యాసలో అదరగొట్టనుందన్న మాట. ప్రేమకథగా రూపొందుతున్న ఈ సినిమా చిత్రీకరణ సోమవారం మొదలయ్యింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version