ఉప్పెన పాట సరికొత్త రికార్డు..

-

సాయి ధరమ్ తేజ్ తమ్ముడు పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయం అవుతున్న ఉప్పెన సినిమా నుండి రిలీజ్ అయిన నీ కన్ను నీలి సముద్రం అనే పాట సరికొత్త రికార్డుని క్రియేట్ చేసింది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ పాటకి ప్రేక్షకుల నుండి అద్భుతమైన రీతిలో రెస్పాన్స్ వచ్చింది. క్రితి శెట్టి హీరోయిన్ గా కనిపిస్తున్న ఈ సినిమాలోని ఈ పాటకి యూట్యూబ్ లో 150మిలియన్ల వ్యూస్ వచ్చాయి. డెబ్యూ మూవీ పాటకే ఈ రేంజిలో రెస్పాన్స్ రావడం నిజంగా ఆశ్చర్యమే.

ఇదే కాదు ఉప్పెన సినిమా నుండి రిలీజ్ చేసిన మరో రెండు పాటలకి మంచి వ్యూస్ వస్తున్నాయి. ధక్ ధక్ ధక్, రంగులద్దుకున్నా పాటలని ప్రేక్షకులు మళ్ళీ మళ్ళీ వింటున్నారు. ఈ సినిమా ముందు వరకూ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం పట్ల జనాల్లో కొంత వ్యతిరకత ఏర్పడింది. కొట్టిన ట్యూన్లనే కొడుతున్నాడని విమర్శలు చేసారు. కానీ ఈ సినిమాతో ఆ అపప్రద పోగొట్టుకుంటున్నాడు. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్స్ నిర్మిస్తుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version